Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిలే నిరాహార దీక్షలో వర్తక సంఘం సభ్యులు
నవతెలంగాణ-బూర్గంపాడు
గోదావరి వరదలతో ముంపుకు గురవుతున్న బూర్గంపాడు మండలంలోని ప్రాంతాలకు పోలవరం ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ రిలే నిరాహార దీక్షలలో శుక్రవారం బూర్గంపాడు వర్తక సంఘం ఆధ్వర్యంలో చేపట్టారు. వర్తక సంఘం ఆధ్వర్యంలో బూర్గంపాడులో తొలుత ప్రదర్శన చేసి, అనంతరం దీక్ష శిబిరం వద్ద దీక్షలలో వర్తక సంఘం సభ్యులు కూర్చున్నారు. వీరికి జేఏసీ నాయకులు పూల మాలలు వేసి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బూర్గంపాడు ప్రాంతాన్ని పోలవరం ప్రాంతంగా ప్రకటించాలని అన్నారు. ఈ కార్యక్రమ ంలో గ్రామ వైద్యులు డాక్టర్ విష్ణు, డాక్టర్ ప్రసాద్, మాజీ ఎంపీటీసీ జక్కం సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సతీమణి కుంజా వెంకట రమణ, న్యూ సెంచరి హై స్కూల్ కరస్పాం డెంట్ (లైక్) ఆసిక్, సీపీఐ(ఎం) మండల అధ్యక్షులు బత్తుల వేంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ కాకర్ల ప్రతాప్, పిల్లమర్రి గోపి, జగదిష్ వార్డు మెంబర్ ఆరిఫ్ జేఏసీ కమిటీ సభ్యులు కె.వి.రమణ, దామర శ్రీను పలువురు దీక్షలో కూర్చున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు దనసరి సూర్య, పినపాక నియోజక వర్గం కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోతిరెడ్డి శ్రీనివాస రెడ్డి, వెంకట రావు పాల్గొన్నారు.