Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర పగ్గాలు చేపట్టడం హర్షనీయం
- కూనంనేని అభినందన సభలో వక్తలు
నవతెలంగాణ-కొత్తగూడెం
పేద, కార్మిక, కర్షకులకు కూనంనేని భరోసగా నిలుస్తారని, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా ఉన్న నేతకు రాష్ట్ర పగ్గాలు చేపట్టడం హర్షనీయమని కూనంనేని అభినందన సభలో వక్తలన్నారు. శుక్రవారం కొత్తగూడెం క్లబ్లో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా అధ్యక్షతన జరిగిన కూనంనేని అభినందన సభలో పలువురు వక్తలు మాట్లాడారు. కొత్తగూడెం ప్రాంతంలో అనేక ప్రజా, కార్మిక ఉద్యమాలకు నాయకత్వం వహించి ఇక్కడి ప్రజలను ఉద్యమాలవైపు నడిపించి ప్రజా ఉద్యమ సేనాని కూనంనేని అని అన్నారు. పోరాట పథంలో ముందు నిలిచిన కూనంనేని సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక కావడం సంతోషకరమ న్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య, విద్యావేత్త మాచవరపు కోటేశ్వర్రావు, చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు కొదుమూరి శ్రీనివాసరావు, పల్లపోతు సాయి, కంభంపాటి రమేష్, పల్లపోతు వాసు, అశోక్ రాఠి, ముస్లిం మైనార్టీ నాయకులు నయిం ఖురేషి, అబీద్, జడ్పిటిసి, మేరెడ్డి వసంత, జనార్ధన్ రెడ్డి, మద్దెల శివకుమార్, సామాజిక సంఘాల నాయకులు ఇందిరాల దుర్గయ్య, రాజయ్య, వీరభద్రం, బ్రాహ్మణ సేవా సంఘం దత్తు శర్మ, క్రిష్టియన్ మత పెద్దలు విజరు కుమార్ తదితరులు మాట్లాడారు.
కూనంనేనికి అభినందనలు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై తొలిసారి భద్రాది జిల్లాకు వచ్చిన కూనంనేనికి జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక కొత్తగూడెం క్లబ్లో అభినందన సభ ఏర్పాటు చేశారు.
ఈ సభలో కూనంనేనిని వివిధ సంఘాల ప్రముఖులు, పార్టీ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పూలమాలలువేసి శాలువాలతో సత్కరించారు. ముస్లీం మైనార్టీ సంఘాలు, క్రిష్టియన్, బ్రాహ్మణ సంఘం, విద్యాసంస్థల ప్రముఖులు, మర్చింట్ అసోషి యేషన్, చాంబర్ ఆఫ్ కామర్స్ అసోషియేషన్ నాయకులు, సిపిఐ, ప్రజా సంఘాలు, పలు కార్మిక సంఘాలు ఆయనను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.