Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్ఎల్సీ ఆఫీస్ వద్ద సింగరేణి యాజమాన్యం
- లేబర్ డిపార్ట్మెంట్ వైఖరి పై ఆందోళన చేపట్టిన జేఏసీ
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఫిబ్రవరి 9వ తేదీ నుంచి హామీలను వెంటనే అమలు చేయాలని తలపెట్టిన సమ్మె గత 8రోజుల నుంచి జరుగుతున్నప్పటికీ సింగరేణి యాజమాన్యం గాని లేబర్ డిపార్ట్మెంట్ గాని సమస్యలు పరిష్కారానికి సానుకూలంగా వ్యవరించని నేపథ్యంలో సమ్మెను ఉద్రతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపు నిచ్చారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి, లేబర్ డిపార్ట్మెంట్ పదే, పదే వాయిదాలను నిరసిస్తూ హైదరాబాద్ ఆర్ఎల్సి వద్ద డిప్యూటీ చేయాల్సిన సింగరేణి అధికారులను నిర్బందించి చుట్టుముట్టి జేఏసీ నాయకులు ఆందోళన చేపట్టారు. తక్షణమే సమస్యల ను పరిష్కరించాలని ఇక ఉపేక్షించేది లేదని నాయకులు హెచ్చరించారు. డిప్యూటీ సిఎల్సి ఛాంబర్లో నాయకులు కింద కూర్చొని నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గుత్తుల సత్యనారాయణ, బి.మధు, ఏ.వెంకన్న, ఎస్కె. రాసుద్దీన్, ఎస్కే. యాకూబ్ షావలి, జి.రమేష్, ఇనపనూరి నాగేశ్వరరావు, కాలం నాగభూషణం, యర్రగాని కృష్ణయ్య, డి.బ్రహ్మానందం, వై.ఆంజనేయులు ఆర్.మధుసూదన్ రెడ్డి, కె.విశ్వనాథ్, మంగీలాల్ పాల్గొన్నారు.