Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
2016-17 సంవత్సరంలో మండలంలోని మంగళ్ళిగుట్ట, కొత్త గంగారం గ్రామాల ఆదివాసులపై ఫారెస్ట్ అధికారులు పెట్టిన పోడుభూముల కేసులలో శుక్రవారం కొత్తగూడెం కోర్టులో పోడుదారులకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చినట్టు, వారిపై ఉన్న కేసులను కూడా కొట్టేయడం జరిగిందని, పోడు భూములకు తక్షణమే హక్కుపత్రాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) మండల నాయకులు నిమ్మల మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫారెస్ట్ అధికారులు ఎన్ని కుట్రలు, కేసులు బనాయించిన ఒక సెంటు పోడు భూమిని కూడా వదిలేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వర్షా శ్రీరాములు, వాడే కళ, వాడే భద్రం, కారం నర్సింహులు, సడియం చందర్రావు, కారం దారప్ప, వెంకటేష్, పాపారావు, రమణబాబు, కృష్ణ, కన్నప్ప, వెంకటేష, కుంజా రాముడు తదితరులు పాల్గొన్నారు.