Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవ ర్యాలీ
- కలెక్టర్ అనుదీప్, ఎమ్మెల్యే వనమా
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ జాతీయ సమైఖ్యతా దినోత్సవ చరిత్ర నేటి తరం యువతకు చెప్పాల్సిన అవసరం ఉందని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఎస్పీ డాక్టర్ వినీత్.జీలు అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 16, 17, 18 తేదీల్లో తెలంగాణ జాతీయ సమైఖ్యతా వారోత్సవాలు నిర్వహణలో భాగంగా మొదటి రోజు కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి ప్రకాశం స్టేడియం వరకు వేలాది మంది ప్రజలతో భారీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో వారు మాట్లాడుతూ ఇదొక మహౌన్నత కార్యక్రమని చెప్పారు. తెలంగాణ పోరాట పటిమను మనందరం గుర్తుంచుకోవాలని ఆయన చెప్పారు. 17వ తేదీన అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని, ఉదయం 8.30 గంటలకు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కొత్తగూడెం ప్రగతి మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. 18వ తేదీ ఉదయం 10 గంటలకు కొత్తగూడెం క్లబ్బులో కవులకు సన్మానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ కాపు సీతా లక్ష్మి, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి స్వర్ణలత, జిల్లా అధికారులు, తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
మతం రంగు తో విభజిస్తే సహించం : విప్ రేగా
మణుగూరు : బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లు వస్తావు కొడుకు నైజాం సర్కారోడ అంటూ సాగిన మహౌన్నత ఉద్యమం తెలంగాణలో జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం జడ్పీ కో ఎడ్యుకేషన్ పాఠశాలలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కుల, మతాల పేరుతో రాష్ట్రాన్ని విభజించేందుకు కుట్ర జరుగుతుందన్నారు. లౌకిక రాజ్యాంగం మనది మహాత్ముడు నడయాడిన ప్రజాస్వామ్య భారతదేశంలో మత ఘర్షణ సృష్టిస్తే సహించబోమన్నారు. ప్రపంచానికి శాంతి అందించిన దేశం మనదని విభజిస్తే ఊరుకోపోమన్నారు. వాస్తవాలను వక్రీకరిస్తున్నరన్నారు. స్వాతంత్య్ర రాజ్యాంగం ఉన్న హైదరాబాదును కాంగ్రెస్ పార్టీ నాయకులైన రామనంద తీర్థ రాజరాజేశ్వరరావు, పింగళి రాజలింగారెడ్డి మేధావులు సూచనలతో నిజాం భార తదేశంలో విలీనమైందన్నారు. ప్రజా గాయకుడు సిద్ధల వెంకటేశ్వర్లు దేశభక్తి గీతాలతో ఆకట్టుకున్నారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలతో భారీ ఊరేగి ంపు ప్రజలను ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో నియోజక వర్గస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వ్యవసాయం, సంక్షేమానికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత : మెచ్చా
అశ్వారావుపేట : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి, సంక్షేమానికే అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఇందులో భాగంగానే రైతు బంధు, దళిత బంధు పథకాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం స్థానిక వ్యవసాయ కలాపాలు క్రీడా మైదానం ఏర్పాటు చేసిన వేడుకలో ముఖ్య అతిథిగా హాజరు అయి ప్రసంగించారు. ముందుగా అశ్వారావుపేట మూడు రోడ్ల కూడలి నుండి సభా వేదిక వరకు 2 కి.మీ మేర జాతీయ పతాకాలను చేతబూని భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుకల నియోజక వర్గం నోడల్ అధికారి, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ జిల్లా ఉన్నతాధికారి జినుగు మరియన్న అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎంపీపీ, జడ్పీటీసీ, తహసీల్దార్, ఎండీఓలు శ్రీరామమూర్తి, వరలక్ష్మి, చల్లా ప్రసాద్, విద్యాధర రావులతో పాటు దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సమైక్యత వజ్రోత్సవ ప్రారంభోత్సవ ర్యాలీ
ఇల్లందు : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 75వ సమైక్యత వజ్రోత్సవాల భాగంగా శుక్రవారం నియోజకవర్గ కేంద్రంలో 15వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే హరిప్రియ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పలు శాఖల ప్రభుత్వ అధికారులు, విద్యార్థిని విద్యార్థులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మార్కెట్ కమిటీ మున్సిపల్, గ్రంథాలయ సంస్థ చైర్మెన్లు హరి సింగ్ నాయక్, వెంకటేశ్వరరావు రాజేందర్ మాట్లాడుతూ 1947 సంవత్సరంలో భారతానికి స్వతంత్రం సిద్ధించినప్పటికీ తెలంగాణ మాత్రం రజాకార్ల నిర్బంధంలో అల్లాడిందని నాటి సాయుధ పోరాట వీరుల త్యాగాల ఫలితం సర్దార్ వల్లభారు పటేల్ 1948 సెప్టెంబర్ 17న మిలిటరీ సైన్యంతో తెలంగాణకు వచ్చిందన్నారు. తెలంగాణ అంటేనే పోరాటాల పురిటగడ్డ అని తెగువకు వెనకాడని నైజం ఉన్నవారే అన్నారు.
భద్రాచలంలో జాతీయ సమైక్యత ర్యాలీ
భద్రాచలం : ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని, దీనిలో భాగంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు కూడా జరుపుకుంటున్నామని, నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదంతో ముందుకు పోయి, మనకు రావలసిన హక్కులను పొందితే మనకు, మన జీవితానికి సార్ధకత లభిస్తుందని భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు పొదెం వీరయ్య అన్నారు. శుక్రవారం భద్రాచలంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతం పోట్రూ, జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు విద్యార్థిని, విద్యార్థులుతో మార్కెట్ యార్డ్ నుండి, జూనియర్ కళాశాల మైదానం వరకు జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎంఎల్ఏ మాట్లాడారు. సెప్టెంబర్ 17 నాడు మన భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైనదని అన్నారు. జిల్లా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... నిజాం నిరంకుశ పాలన నుండి స్వతంత్రత దక్కించుకోవడానికి ఎందరో మహనీయులు సాయుధ పోరాటాలు జరిపారన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంల నియోజకవర్గం నోడల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, భద్రాచలం స్పెషల్ ఆఫీసర్ నాగలక్ష్మి, చర్ల, దుమ్ముగూడెం జడ్పీటీసీలు శాంత, సీతమ్మ, చర్ల, దుమ్ముగూడెం ఎంపీపీలు కోదండరామయ్య, రేసు లక్ష్మి, భద్రాచలం, దుమ్ముగూడెం ఎంఈఓ సమ్మయ్య, చర్ల ఎంఈఓ జుంకీ లాల్, భద్రాచలం తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి : అశ్వారావుపేట నియేజక వర్గ కేంద్రంగా శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరావు ఆధ్వర్యంలో నిర్వహి ంచిన వజ్రోత్సవ వేడుకులకు అన్నపురెడ్డిపల్లి మండలం నుండి టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో సుమారు 1500 మందికి పైగా కార్యకర్తలు, అభిమానులు ఆటోలలో ర్యాలీగా వెళ్ళినారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ భారత లాలమ్మ(లావణ్య), ఏపీఎం రామబద్రయ్య, సీసీ శ్రావణి, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
బూర్గంపాడు : తెలంగాణా జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా శుక్రవారం బూర్గంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిం చారు. అనంతరం బూర్గంపాడులోని అంబేద్కర్ సెంటర్లో విద్యార్థులు, అధ్యాపకులు ఆధ్వర్యంలో మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.
ఆళ్ళపల్లి : రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు పట్టణంలో జరిగిన నిండు సభలో ఆళ్ళపల్లి మండలానికి చెందిన రేగా అభిమాని మద్దెల రామదాసు కుటుంబానికి రానున్న దళిత బంధు పథకంలో తొలి ప్రాధాన్యత ఇస్తానని రేగా ప్రకటించడం పట్ల ఆ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు శుక్రవారం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మండలంలో రామదాసుకు దళిత బంధు లబ్ధిదారుల్లో ఎమ్మెల్యే ప్రథమ స్థానం కల్పించడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.