Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మెన్ మండె వీర హనుమంతరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడమే సహకార సంఘం ముఖ్య ఉద్దేశ్యమని కొత్తగూడెం సహకారం సంఘం చైర్మెన్ మండె వీర హనుమంతరావు అన్నారు. శుక్రవరం చుంచుపల్లి మండలంలోని, విద్యానగర్ కాలనీలో గల ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయములో జరిగిన కార్యక్రమంలో ఇటీవల మరణించిన రైతులకు సంఘం నందు ఇన్సూరెన్స్ చేయించునందున అట్టి రైతులు మరణించిన వారికి రూ.50,000లు బీమా వర్తించినదని తెలిపారు. అందులో భాగంగా హేమచంద్ర పురంకు చెందిన దాసరి రవి మరణించిన తరువాత నామిని అయిన దాసరి చంద్రకళకు రూ.50,వేల నగదు, కోయగూడెంనకు చెందిన ఇరపా మదనమ్మ మరణించి తరువాత వారి నామిని అయిన ఇరపా లక్ష్మీనారాయణకు రూ.50వేలు వెరసి మొత్తం రూ.1,00,000.00లు అందజేసినుట్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటి ఉపాద్యక్షులు కూచిపూడి జగన్నాధ రావు, సొసైటి సీఈఓ సారయ్య, సొసైటి డైరెక్టర్ మాళొతు సేవ్యా, రైతులు పాల్గొన్నారు.