Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెన్కో ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు
- ఈ నెలాఖరులో పీఆర్సీ పై అన్ని సంఘాలతో చర్చలు
- సీఎండీని సన్మానించిన టీఆర్వీకేఎస్
నవతెలంగాణ-పాల్వంచ
రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సరఫరాలో కార్మికుల కృషి ఎంతో అభినందనీయమని ట్రాన్స్కో జెన్కో చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకర్ రావు కొనియాడారు. శుక్రవారం హైదరాబాద్ విద్యుత్ సౌధాలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కేవీ జాన్సన్, కోడూరు ప్రకాష్, రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ జెన్కో కార్యదర్శి చారుగుండ్ల రమేష్ ఆధ్వర్యంలో ఆయన కలిసి ఈ నెల 7వ తేదీన అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సీఎండీ ప్రభాకర్ రావుని, రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో ఉద్యోగుల కార్మికుల కృషిని కొనియాడినందుకు పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంల సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ రంగంలో ఈ విజయం పట్ల ముఖ్యమంత్రి అభినందించడం మన అందరి సమిష్టి విజయమన్నారు. తదుపరి విద్యుత్ ఉద్యోగుల పిఆర్సి, ఈపీఎఫ్ నుండి జిపిఎఫ్, ఆర్టిజన్ సమస్యలు గురించి, ఎన్పీడీసీఎల్లో ప్రమోషన్ల గురించి సిఎండి దృష్టికి తీసుకువెళ్లగా, పిఆర్సి అమలు చేయుటకు ఈ నెలాఖరులో అన్ని సంఘాల వారిని చర్చలకు పిలుస్తున్నామని, ఈ సమావేశంలో ఈపీఎఫ్ పై కూడా చర్చిస్తామని, ఆర్టిజన్స్ ముఖ్య సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కమలాకర్ రావు, శ్రీధర్ గౌడ్, నిరంజన్, ఎండి యూసఫ్, కార్యదర్శి కరెంటురావు, కార్యదర్శి పి.రాములు, రజినీకాంత్, నరేంద్ర పాల్, విశాల్, నవీన్ వర్మ, తదితరులు పాల్గొన్నారు.