Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు
- ఖమ్మంలో ఘనంగా ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ- ఖమ్మం
ఆర్టీసీ కార్మికుల ఐక్యత, హక్కుల సాధన కోసం పోరాటాలే మార్గమనే సూత్రబద్ధ వైఖరితో, ఐక్యత పోరాటం నినాదంతో భారత కార్మిక సంఘాల కేంద్రం (సిఐటియు)కు అనుబంధంగా ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్ డబ్ల్యూ ఎఫ్) 1979 సెప్టెంబర్ 16వ తేదీన ఆవిర్భవించిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కల్యాణం వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మంలోని సిహెచ్.వి.రామయ్య స్మారక భవనం వద్ద గుండు మాధవరావు అధ్యక్షతన ఆర్టీసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ 44వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి గడ్డం లింగమూర్తి ఆత్మీయ అతిథిగా పాల్గొని సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ చండ్ర వెంకట్రామయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్వేతారుణ ఎస్ డబ్ల్యూ ఎఫ్ పతాకాన్ని కళ్యాణం వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలోడిపో కమిటీ సహాయ కార్యదర్శి పగిళ్ళపల్లి నరసింహారావు రీజియన్ ప్రచార కార్యదర్శి తోకల బాబు,రీజియన్ కోశాధికారి తాళ్ల సితార(పర్వీణ),నాయకులు ఎనబోతుల శ్రీనివాస్, రాములు, గడ్డం అయోధ్య, కే.కృష్ణయ్య, సీతమ్మ, రాధ, జ్యోతి, శాంతకుమారి, లలిత, ఉమా, కోటేశ్వరరావు, వేణు, ఆకుతోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.