Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లి పురవీధులు త్రివర్ణ భూషితమయమైంది. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నేతృత్వంలో శుక్రవారం జరిగిన తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవ సంబురం అంబరాన్నంటింది. నియోజకవర్గంలోని మండలాల నుంచి సుమారుగా 15వేల మంది ఈ వజ్రోత్సవ సంబురానికి తరలి రావడంతో సత్తుపల్లి కిక్కిరిసి పోయింది. స్థానిక జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సభ, ధూం ధాం కార్యక్రమాల అనంతరం ప్రదర్శన ప్రారంభమైంది. సుమారు 4 కిలోమీటర్ల మేర జాతీయ జెండాలతో భారీ ప్రదర్శన పట్టణ కనువిందు చేసింది. జాతీయ రాష్ట్ర సమైక్య గీతాలు, తెలంగాణ ఉద్యమ గీతాలతో పట్టణం దద్దరిల్లింది. ఈ ప్రదర్శన రాష్ట్రీయరహదారి మీదుగా సిద్దారం రోడ్డులోని లక్ష్మీప్రసన్న, ఎంఆర్ గార్డెన్ ఫంక్షన్ హాళ్ల వరకు సాగింది. అనంతరం అక్కడ మహిళలు, పురుషులకు విడివిడిగా భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
రాజరికం పోయి... ప్రజాస్వామ్యమొచ్చే : ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నిజాం నవాబులు పాలనలో తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జమిందారీ, పెత్తందార్ల రాచరిక పాలన అంతమొంది ప్రజాస్వామ్య పాలనలోకి వచ్చి 75 యేండ్లు అవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్య వజ్రోత్సవ సంబురాలను మూడు రోజుల పాటు అట్టహాసంగా నిర్వహిస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆర్డీవో సూర్యనారాయణ అధ్యక్షతన ఈ సంబురాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, డీసీఎంఎస్ ఛైర్మెన్ రాయల శేషగిరిరావు, ఏసీపీ ఎన్.వెంకటేశ్, కమిషనర్ కోడూరు సుజాత, వైస్ ఛైర్మెన్ తోట సుజలారాణి, నాయకులు గాదె సత్యనారాయణ, కొత్తూరు ప్రభాకరరావు, యాగంటి శ్రీనివాసరావు, ఎస్కే రఫీ, అంకమరాజు, కౌన్సిలర్లు, రెవెన్యూ, పోలీసు, ఫారెస్ట్, అన్ని ప్రభుత్వ విభాగాలు ప్రయివేట్, ప్రభుత్వ విద్యా సంస్థలు, మున్సిపల్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు.
మధిర : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలొడ్డి సాధించి పెట్టిన తెలంగాణపైనా, రాష్ట్ర ప్రజలపైన కుట్రలు జరుగుతున్నాయని, వాటిని చైతన్యవంతులైన ఖమ్మం జిల్లా ప్రజలు తిప్పికొట్టాలని టీఆర్ఎస్ లోక్ సభా వక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు, వజ్రోత్సవాలను పురష్కరించుకుని శుక్రవారం మధిరలో జరిగిన భారీ ప్రజా ప్రదర్శనలో నామ అగ్రభాగాన నిలిచిన భారీ ర్యాలీ అనంతరం మధిర మార్కెట్ యార్డ్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ఎంపీ నామ మాట్లాడారు. మధిర మున్సిపల్ చైర్పఛైర్ పర్సన్ మొండితోక లత అధ్యక్షతన జరిగిన ఈ సభలో మధిర ఎమ్మెల్నే భట్టి విక్రమార్క, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర జిల్లాపరిషత్ ఛైర్మన్ లింగాల కమలరాజు, రైతు బందు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఆత్మ కమిటీ ఛైర్మన్ రంగి శెట్టి కోటేశ్వరరావు, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, మధిర, ఎర్రుపాలెం, చింతకాని, ముదిగొండ ఎంపీపీలు మెండెం లలిత, దేవరకొండ శిరీష, కొపూరి పూర్ణయ్య, సామినేని హరిప్రసాద్, జిల్లా నాయకులు చావా రామకృష్ణ, మధిర సొసైటీ చైర్మన్ బిక్కి కృష్ణప్రసాద్, మండల పార్టీల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, పల్లపోతు వెంకటేశ్వరరావు, చేబ్రోలు మల్లికార్జున్‌రావు, పంబి సాంబశివరావు, పెంట్యాల పుల్లయ్య, వాచేపల్లి లక్ష్మారెడ్డి, మధిర మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
ఖమ్మం : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లాలో భారీ ర్యాలీ చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర విశిష్టతను చాటిచెప్పేలా కొనసాగిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ర్యాలీ ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజేరు కుమార్ ప్రారంభించారు. నగరంలోని జిల్లా పరిషత్ అంబేద్కర్ సెంటర్ నుండి ప్రారంభమైన ర్యాలీ ఎస్ఆర్ అండ్ బిజిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ వరకు నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజేరు కుమార్, నగర మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజరు, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ,పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభిలు జాతీయ జెండాల్ని చేతబూని ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అధికారులు, కార్పొరేటర్లు, విద్యార్థులు, యువతి, యువకులు, మహిళలు 15 వేల మందితో నిర్వహించిన భారీ ర్యాలీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టింది. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువత, మహిళలు పెద్దఎత్తున జాతీయ జెండాలు చేతబూని ర్యాలీలు తీశారు.
కూసుమంచి : రైతులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడు అని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై 75వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా కూసుమంచిలో ఏర్పాటు చేసిన భారీ జన సభలో ఆయన మాట్లాడారు. సభ అనంతరం 75 మీటర్ల జాతీయ జెండాతో మండల కేంద్రానికి చేరుకున్న నియోజకవర్గ ప్రజలతో భారీ ఎత్తున ర్యాలీని నిర్వహిం చారు. సభా ప్రాంగణం నుండి మండల కేంద్రంలోని బస్టాండ్ నుండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు భారీ ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.
వైరా : 75వ తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా వైరాలో భారీ ర్యాలీని నిర్వహించారు. వైరా శాసనసభ్యులు లావుడియా రాములునాయక్, ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ మొగిలి స్నేహలత సంయుక్తంగా ప్రారంభించి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సుమారు 15వేల మందితో పాత బస్టాండ్ నుంచి వైరా రింగ్ రోడ్ మీదగా వ్యవసాయ మార్కెట్ వరకు చేరుకోవటం జరిగింది. సభలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా ఏసిపి రెహమాన్, మున్సిపల్ కమిషనర్ వెంకటపతి రాజు, మున్సిపల్ చైర్ పర్సన్ సూతకాని జైపాల్, వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, మార్కెట్ చైర్మన్ బీడేకే రత్నం, వివిధ హౌదాలో ఉన్న. ఐదు మండలాల ఎంపీడీవోలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, తాసిల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.