Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం (ఖమ్మంరూరల్ )
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభలు నవంబర్ 4,5,6 తేదీలలో ఖమ్మం నగరంలో జరుగుతున్నాయని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు సిద్ధినేని కోటయ్య తెలిపారు. శుక్రవారం ఖమ్మం రూరల్ వరంగల్ క్రాస్ రోడ్‌లోని తమ్మినేని సుబ్బయ్య భవన్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశం తూమాటి నాగయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కోటయ్య మాట్లాడుతూ ఈ మహాసభలను వ్యవసాయ కార్మికులు ప్రతిష్టగా తీసుకొని మహాసభలను జయప్రదం చేయటానికి విరాళాలు ఇచ్చి మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నెకంటి సంగయ్య మాట్లాడుతూ ఖమ్మం రూరల్ మండలానికి గతం నుండి కూలి పోరాటాలు చేసే చరిత్ర ఉందని, అందుకని వ్యవసాయ కూలీలు విరివిరిగా విరాళాలు ఇచ్చి రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈనెల 19న జరిగే జిల్లా వర్క్ షాప్ కు వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సభ్యులు గ్రామ అధ్యక్ష కార్యదర్శులు వర్క్‌షాప్‌కు హాజరుకావాలని కోరారు. సమావేశంలో సంఘం మండల కార్యదర్శి వడ్లమూడి నాగేశ్వరరావు, రైతు సంఘం నాయకులు తోట పెద్ద వెంకటరెడ్డి, జింక బాలరాజు, గుర్రం ఉపేందర్, యాదగిరి, మల్లికార్జున్, పెంట్యాల నాగేశ్వరరావు, తమన బోయిన సుధాకర్, కత్రం ఉపేందర్, దుండిగల వెంకటేశ్వర్లు, దండుగుల రాంబాబు, పల్లి శ్రీనివాస్‌రావు, పచ్చిపాల నరసయ్య, దగ్గుపాటి వైకుంఠం, కొర్ని వెంకయ్య పాల్గొన్నారు.