Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బస్టాండ్ ప్రారంభోత్స సభలో మంత్రి పువ్వాడ
నవతెలంగాణ-కల్లూరు
కల్లూరు మేజర్ పంచాయతీని త్వరలో మున్సిపాలిటీగా చేయనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ తెలిపారు. శనివారం స్థానికంగా నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ ను మంత్రి పువ్వాడ, శాసన సభ్యులు సండ్ర వెంకటవీరయ్యతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ పేదల రవాణా సౌకర్యం అయిన ఆర్టీసి సంస్థను కాపాడుకుని, ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పిస్తామని అన్నారు. ఉన్న బస్సులను కాపాడుకుంటూ పేద వాడి ప్రజా రవాణాను మరింత మెరుగు పర్చే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సంస్థ సంరక్షణకు బడ్జెట్ లో 15 వందల కోట్లు కేటాయించి 49వేల మంది ఉద్యోగులను, సంస్థను కాపాడుతున్నారని వివరించారు. ఆర్టీసి ప్రజల అస్థి అని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, స్థానిక ఎమ్మెల్యేల నిధులు కేటాయించాలని కోరామని, ఇప్పటికే విజ్ఞప్తి చేయడం జరిగిందని, అందులో భాగంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య స్పందించి తన సిడిపి నిధుల నుండి రూ.10 లక్షలు కేటాయించడం హర్షణీయం అన్నారు. దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని, మన సమస్యలను సాధ్యమైనంత మేర పరిష్కరించకుంటే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు ఇవ్వగలమన్నారు. అనంతరం బస్ స్టాండ్ నిర్మాణ పనుల్లో ముందుకొచ్చిన దాతలను శాలువాతో మంత్రి సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ రాయల శేశగిరిరావు, కల్లూరు రెవిన్యూ డివిజన్ అధికారి సూర్యనారాయణ, ఎంపీపీ బిరవల్లి రఘు, జెడ్పీటీసీ కట్టా అజరు కుమార్, సర్పంచ్ లక్కీనేని నీరజ, అర్అండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హేమలత, జడ్పీ కోఆప్షన్ సభ్యులు ఎండీ ఇస్మాయిల్ రైతు సమితి మండల జిల్లా ప్రతినిధులు లక్కినేని. రఘు, పసుమర్తి .చందర్రావు, డీసీసీబీ డైరక్టర్ బోబోలు లక్ష్మణ్‌రావు, సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.