Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చరిత్ర కమ్యూనిస్టులది
- వీర తెలంగాణ రైతాంగ సాయుధ
- పోరాటానికి సంబంధం లేని బీజేపీ పార్టీ చరిత్రను వక్రీకరిస్తుంది
- మాజీ ఎంపీ మిడియం బాబురావు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దొర ఏందిరో..దొర పీకుడేందిరో...అంటూ దొరల గడిల పెత్తనాన్ని కూల్చి పోలీస్ నైజాం రజాకార్లను తరిమి కొట్టిన చరిత్ర కమ్యూనిస్టులదని వీర తెలంగాణ సాయుధ పోరాటానికి ఎటువంటి సంబంధం లేని బీజేపీ చరిత్రను వక్రీకరిస్తున్నారని మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మీడియం బాబురావు అన్నారు. శనివారం ములకపాడు గ్రామంలోని అమరజీవి యలమంచి సీతారామయ్య భవనంలో 'తెలంగాణ వీలినం వాస్తవాలు వక్రీకరణలు' అనే అంశంపై పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య అధ్యక్షతన జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా బాబురావు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముందుండి పోరాటం చేసిన ఆనాటి ఉద్యమం భూమికోసం భుక్తి కోసం వెట్టిసాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటం 1946లో ప్రారంభమై 1948 నుంచి 1951 వరకు ఉద్యమం కొనసాగింది వారు తెలిపారు. ఉద్యమంలో మొట్టమొదటిగా వీర మరణం పొందిన అమరవీరుడు దొడ్డి కొమరయ్య అని తరవాత చిట్యాల ఐలమ్మ పాటు అనేకమంది కమ్యూనిస్టు నాయకులు అమరత్వం పొందారన్నారు. సుమారు నాలుగువేల మంది అమరవీరులు నాయకులు, కార్యకర్తలు వీర తెలంగాణ రైతంగ సాయుధ పోరాటంలో గడిలో దొరలను తరిమి తరిమి కొట్టి దొరల పెత్తనాన్ని కూల్చివేయడం జరిగిందన్నారు. పది లక్షల ఎకరాలు భూమిని నీరుపేద బడుగు బలహీన వర్గాలకు ఆనాటి కమ్యూనిస్టు ఉద్యమంలో ఎర్ర జెండా నాయకత్వానికే సాధ్యమైందన్నారు. మన దేశంలో గద్దెనెక్కి కూర్చున్న మతోన్మాద బీజేపీ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉన్నట్లు చరిత్ర వక్రీకరి స్తున్నారని వాళ్లు ఆనాటికి పుట్టలేదనే విషయాన్ని బీజేపీ పార్టీ తెలుసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయా మొత్తం సెప్టెంబర్ 17 చుట్టూ తిరుగుతున్నాయని ఇప్పుడు ఈ చర్చ ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు అని వారన్నారు. విలీనమా, విమోచన, విద్రోహమా అన్న చర్చ సాగుతుందని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రాధాన్యతను యువత ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాయని గుర్తు చేశారు. తెలంగాణ సమాజాన్ని నిజం రాజు నుంచి విముక్తి చేసింది కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చెప్పు కుంటుండగా, ఎంఐఎం కూడా విలీన దినాన్ని ప్రకటించగా, అధికార టీఆర్ఎస్ పార్టీ జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రకటించింది. ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టేది మరొకదారి అన్నట్టు బీజేపీ మాత్రం వక్రమార్గం వదలలేదని విమోచన దినోత్సవం పేరుతో విచ్చినకర్ర ఎత్తుగడలతోని ముందుకు సాగుతుందన్నారు. పోడు సాగు చేస్తున్న భూములకు పట్టాల కోసం నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ప్రజలందరూ ఆందోళన పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోల్లగాని బ్రహ్మచారి, జిల్లా కమిటీ సభ్యులు సరియం కోటేశ్వరరావు, యలమంచి వంశీకృష్ణ, పార్టీ సీనియర్ నాయకులు మర్మం చంద్రయ్య, మాజీ డీసీసీబీ చైర్మన్ ఎలమంచి రవికుమార్, జిల్లా కమిటీ సభ్యురాలు కోర్స చిలకమ్మ, సరియం రాజమ్మ, పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు యలమంచి శ్రీను బాబు, మర్మం సమ్మక్క, మండల కమిటీ సభ్యులు కోడాలి లోకేష్ బాబు, ఎండి మహమ్మద్ బేగ్, వాగే ఖాదర్ బాబు, సోయం వీర్రాజు, గుడ్ల సాయిరెడ్డి, సర్పంచ్ తోడం తిరుపతిరావు, ఉప సర్పంచ్ గుడ్ల రామ్మోహన్ రెడ్డి, ఇనుగుర్తి రాజేశ్వరి, బర్రి నరసింహారావు, ఎస్.కె హుస్సేన్, బైరెడ్డి సతీష్, గుడ్ల తాతారావు, కోర్స సీతారామయ్య, పాల్గొన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బీజేపీ : బాబురావు
బూర్గంపాడు : ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు వక్రీకరిస్తున్నారని భద్రాచలం మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు ఆరోపించారు. తెలంగాణ విలీన దినోత్సవం సభను సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య నగర్లో శనివారం నిర్వహించారు. ఈ సభకు పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో బాబురావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డిలు మాట్లాడారు. చాకలి ఐలమ్మ కమ్యూనిస్టు జండా పట్టుకొని ఉద్యమించిందని పేర్కొన్నారు. నేటి మతోన్మాదులు ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పాపినేని సరోజన, ఎస్.కె అబిద, పార్టీ సభ్యులు పాల పాట్ట వేణు, బత్తుల ఏడుకొండలు, కౌలూరి నాగమణి, మచ్చ కృష్ణవేణి, కమటం మరియమ్మ, సిహెచ్ కోటేశ్వరావు, బందెల లక్ష్మణరావు, జి.కృష్ణ, శ్రీదేవి, ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు.
సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు : కనకయ్య
ములకలపల్లి : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య పిలుపునిచ్చారు. శనివారం మండల పరిధిలోని పూసుగూడెం గ్రామపంచాయతీలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ సభలో పాల్గొని ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 4 వేల మంది కమ్యూనిస్టుల, ప్రజలు ప్రాణాధర్పణతో 10 వేల ఎకరాల భూములను పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉందని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ ఉద్యమం ఆనాడు కమ్యూనిస్టుల నాయకత్వంలో భూమికోసం, భుక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన పోరాటాన్ని ఈనాడు బీజేపీ పార్టీ రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని వాడుకోవాలని చూస్తే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. నిజాం రాజులను, పటేల్ దోరల గడీలను బద్దలు కొట్టి, సైన్యాలను ఎదుర్కొని పోరాటం చేసిన చరిత్ర కమ్యూనిస్టులకే ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు అన్నవరపు సత్యనారాయణ, మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, పోడియం వెంకటేశ్వర్లు, మాలోత్ రాజా, గౌరీ నాగేశ్వరరావు, నిమ్మల మధు, గడ్డం వెంకటేశ్వర్లు, సర్పంచ్ కుంజా భాస్కర్, పులి వెంకటేశ్వర్లు, పద్దం తిరుపతమ్మ, పాయం అమల, తేజవత్ జగ్గు, హేమాని, తదితరులు పాల్గొన్నారు.
సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే : కాసాని
సుజాతనగర్ : సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే నని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య అన్నారు. శనివారం సాయుధ పోరాట వారోత్సవాలు మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయుధ పోరాట స్ఫూర్తితో బీజేపీ అమలుపరుస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కె.ధర్మ, లిక్కి బాల రాజు, మండల కార్య దర్శి వీళ్ళ రమేష్, బానోత్ కుమారి పాల్గొన్నారు.