Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ
- స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు ఘనసన్మానం
నవతెఅలంగాణ-పాల్వంచ
స్వాతంత్య్ర వేడుకలని హడావిడి చేసే రాజకీయ పార్టీలు కేవలం రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి వేడుకలు చేస్తున్నారని ఈనాడు స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకే ఉందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఎడవల్లి కృష్ణ అన్నారు. మన దేశ స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధులైన మాడపాటి వెంకటనారాయణ, కొండం నారాయణ, సేవలను స్మరించుకుంటూ వారి శ్రీమతులకు వాడపాటి సక్కుహాయి, కొండం వెంకమ్మలను 75వ స్వాతంత్య్ర వేడుకలలో భాగంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. శాలువ కప్పి పూలమాలతో సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వాడపాటి శ్రీను, కాంగ్రెస్ పట్టణాద్యక్షులు నూకల రంగారావు, మరోహర్, వీరయ్య చౌదరి, కొండం వెంకన్న, గడ్డల రమేశ్, ఎస్కె చాంద్‌పాషా, రాములు నాయక్, శెట్టిపల్లి వెంకట్, భానుకుమార్, ఎడవల్లి సుశీల, లీలమ్మ, సూర్యదేవర కోటేశ్వరరావు, వెలగ రామకృష్ణ, ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.