Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ సమైఖ్యతా దినోత్సవ శుభాకాంక్షలు
- విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు, పోడు సాగుదారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. తెలంగాణ జాతీయ సమైఖ్యతా దినోత్సవాల్లో భాగంగా శనివారం కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి మైదానంలో నిర్వహించిన జాతీయ పతాక ఆవిష్కరణ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి అమర స్థూపానికి పూల మాలలు వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు తెలంగాణ జాతీయ సమైఖ్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ఆయన మాట్లాడుతూ ఏజన్సీ ప్రాంతాల పోడు భూముల సాగులో అటవీ, పోలీస్ పోడు రైతులు నిత్యం తీవ్ర స్థాయిలో ఘర్షణలు పడుతున్న విషయం తెలిసిందేనని, పోడు భూములకు పట్టాలు ఇవ్వనున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం పోడు సాగు రైతుల నుండి దరఖాస్తులను సైతం స్వీకరించినట్లు చెప్పారు. పోడు సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమ శాఖ ఈ నెల 11వ తేదీన జిఓ నెం.140ను విడుదల చేసినట్లు ఆయన వివరించారు. పోడు సమస్య పరిష్కారానికి జిల్లా స్థాయి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తూ వీటిలో అధికారులు, ప్రజా ప్రతినిధులకు భాగస్వామ్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. గతంలో కొత్తగూడెం, భద్రాచలం రెండు డివిజన్లులో కలిపి 24 వేల 450 వ్యక్తి గత దరఖాస్తులు ద్వారా 86 వేల 710 ఎకరాలకు అటవీ హక్కు పత్రాలు జారీ చేశామని తెలిపారు. రైతు బంధు పథకం ద్వారా ఈ ఏడాదికి ఎకరాకు 10 వేలు చొప్పున 23 వేల 926 మంది గిరిజనులకు రూ.84 కోట్లు బ్యాంకు ఖాతాల్లోజమ చేశామన్నారు. జిల్లాలో 98 వేల 962 మంది దివ్యాంగులకు ప్రతి నెలా రూ.21 లక్షల 19 వేలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన మాట మేరకు గత నెల ఆగష్టు 15న అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్లు మంజూరు చేశామని దీంతో జిల్లాలో నూతనంగా 18 వేల 719 మంది వృద్ధులకు రూ.3 కోట్ల 77 లక్షలు, 2 వేల 35 మంది వికలాంగులకు రూ.61 లక్షలు, 6 వేల 622 మంది వితంతువులకు రూ.1 కోటి 34 లక్షలు, 14 మంది కల్లుగీత కార్మికులకు 28 వేలు, 666 మంది ఒంటరి మహిళలకు రూ.14 లక్షలు, ఒక బీడి కార్మికుకుని రూ.2 వేల 16లు, 330 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు రూ.6 లక్షలు, 40 మంది బోధకాల భాదితులకు రూ.81 వేలు. మొత్తం 28 వేల 427 మందికి నూతన పింఛనులు మంజూరు చేశామని చెప్పారు. దళితుల అభివృద్ధి కొరకు దళితబంధు పథకం, ఎలాంటి ఆంక్షలు లేకుండా యూనిట్లు ఏర్పాటుకు రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. గోదావరిలో కలుస్తున్న వందల టియంసి నీటిని సద్వినియోగం పరుచుకొని రెండు పంటలకు సాగునీరందించేందుకు 13 వేల 58 కోట్లతో సీతారామ ఎత్తిపోతల పథకం చేపట్టినట్లు చెప్పారు. అన్ని కాలాల్లో గోదావరిలో 37 టియంసిల నీరు నిల్వ ఉ ండేందుకు రూ.3 వేల 2 వందల కోట్లతో సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. రైతు బంధు పథకం ద్వారా వర్షా కాలంలో పంటల సాగుకు ఒక లక్షా 34 వేల 633 మంది రైతులకు రూ.205 కోట్లు గోదావరి ముంపు ప్రజలకు అధునాతల మోడల్ కాలనీలు నిర్మించేందుకు ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించినట్లు చెప్పారు. జూలై మాసంలో వచ్చిన వరదల వల్ల ముంపుకు గురైన 16వేల 44 కుటుంబాలకు రూ.10 వేల ఆర్థిక సాయంతో పాటు రెండు నెలలకు సరిపడా బియ్యం, కందిపప్పు వంటి నిత్యా వసర సరుకులు పంపిణీ చేశామని చెప్పారు. ఈ కార్యక్ర మంలో జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, కొత్తగూడెం శాసనసభ్యులు వెంకటేశ్వరావు, కలెక్టర్ దురిశెట్టి అనుదీప్. ఎస్పీ డాక్టర్ వినీత్.జీ, జెడ్పీ వైస్ చైర్మెన్ కంచర్ల చంద్ర శేఖర్‌రావు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
భద్రాచలంలో జాతీయ జెండా రెపరెపలు
భద్రాచలం : భద్రాచలం పట్టణంలో శనివారం పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాక ఆవిష్కరణ గావించారు. భద్రాచలం ఐటీడీఏలో పీఓ గౌతమ్ పొట్రూ జాతీయ పతాక ఆవిష్కరణ చేసి, మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు పోరాటాలు జరిపి, మనకు స్వాతంత్య్రాన్ని సంపాదించి పెట్టారని, వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని మనమందరం ముందుకు పోయి, సమైక్యతతో కలిసిమెలిసి ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పరిపాలన అధికారి భీము, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని రమాదేవి, ఎస్.ఓ సురేష్ బాబు, ఏడీ అగ్రికల్చర్ భాస్కరన్, డీఎంజీసీసీ వాణి, ఏసీఎంఓ రమణయ్య, జెడియం హరికృష్ణ, ఐటీడీఏ కార్యాలయంలో పనిచేయుచున్న వివిధ విభాగాల పర్యవేక్షకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు పోదేం వీరయ్య జాతీయ పతాక ఆవిష్కరణ గావించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరేష్, బుడగం శ్రీనివాస్, భోగాల శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ హుస్సేన్, సరళ, వెంకటేష్, తరుణ్ మిత్ర తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాల కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపాల్ ఎం.దేవదాసు జాతీయ జెండా ఆవిష్కరణ గావించారు. భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ భద్రయ్య జాతీయ పతాక ఆవిష్కరణ గావించారు. భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ సిహెచ్ కృష్ణవేణి జాతీయ జెండా ఎగురవేశారు. త్రివేణి స్కూల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ బాబురావు జాతీయ జెండా ఎగరవేశారు. స్థానిక టీఎన్జీవో కార్యాలయం నందు టీఎన్జీవో ప్రెసిడెంట్ డెక్క నరసింహారావు, సెక్రటరీ గగ్గూరి బాలకృష్ణల ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ వేడుక జరిగింది. అసోసియేట్ ప్రెసిడెంట్ కట్కూరి నాగభూషణం, నేటిపారుదల శాఖ జిల్లా కార్యదర్శి శ్యామల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు వీరబాబు, లింగమూర్తి, అపర్ణ, గాంధీ, క్రాంతి, రామకృష్ణ, ఈశ్వర్, అంజిబాబు, వెంకటరమణ, భాస్కర్, బ్రహ్మం, సీతారాములు, విజయ కుమారి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
ఇల్లందు : జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా శనివారం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే హరిప్రియ హరి సింగ్ నాయక్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ హరి సింగ్ నాయక్ మాట్లాడారు. జాతీయ సమైక్యత దినోత్సవాలలో భాగంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా నిర్మించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సఫలీకృతులయ్యారని అన్నారు. అన్ని వర్గాల ఆర్థిక అభ్యున్నతి ధ్యేయంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా తీర్చిదిద్దారని అన్నారు. మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
కేటీపీఎస్‌లో జాతీయ సమైక్యతా దినోత్సవం
పాల్వంచ : భారత జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్బంగా కేటీపీఎస్ ఐదు ఆరు దశలలో ఘనంగా నిర్వహించారు. చీఫ్ ఇంజనీర్ కమతం రవింద్రకుమార్ ముఖ్య అథితిగా పాల్గొని ప్రసంగిస్తూ జాతీయ సమైఖ్యతా దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈలు సంజీవయ్య, మోక్షవీర్, కృష్ణ, వరప్రసాద్, సుధాకర్, ఎస్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జంగయ్య, సీఐ శ్రీనివాస్, ఇంజనీర్లు కార్మికులు ఆర్టీజన్లు, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్యాలయంలో
మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైఖ్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ మురళి, ఎఈ రాజేశ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కోఆపరేటీవ్ సొసైటీ కార్యాలయంలో
నిజాం నిరంకుశ పాలన నుండి రాష్ట్రం దక్కించుకోవడానికి ఎందరో మహానీయులు సాయుధ పోరాటాలు చేశారని భూమికోసం భుక్తికోసం బడుగు బఅలహీన వర్గాల ప్రజలు ప్రత్యేక ఉధ్యమానికి శ్రీకారం చుట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నారని డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. జాతీయ సమైఖ్యతా వజ్రోత్సవాలలో భాగంగా కోఆపరేటీవ్ సొసైటీ కార్యాల యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్ర మంలో వైస్ చైర్మెన్ కాంపెల్లి కనకేష్, డైరెక్టర్లు కనగాల నారాయణ, సీతరాంబాబు, పాపారావు, మధుసూదన్‌రావు, వెంకటేశ్వరరావు, సిఈఓ జి.లకిëనారాయణ, సురేందర్‌రెడ్డి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.