Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
1983-84 ఎస్ఆర్ఎస్ ఏవీపీ స్కూల్లో చదువుకున్న ఆనాటి విద్యార్థులు సుమారు 48 మంది భద్రాచలం పట్టణంలోని వెంకటేశ్వర లాడ్జిలో శనివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. పీఏసీఎస్ చైర్మన్ అభినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిపారు. ఆనాటి వీరి గురువులు లక్ష్మీ తాయారమ్మ, రాధాకృష్ణ మాస్టర్లను ఘనంగా సన్మానించారు. దాదాపు 38 ఏళ్ల తర్వాత ఆనాటి పూర్వ విద్యార్థులు కలుసుకొని గత స్మృతులను గుర్తుకు తెచ్చుకున్నారు. ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకొని తమ ఆనందోత్సవాలు పంచుకున్నారు. అనంతరం తాము చదువుకున్న ఎస్ఆర్ఎస్ ప్రాంగణాన్ని సందర్శించి 25000 విలువచేసే బీరువా, ఫ్యాన్లు, కుర్చీలను పాఠశాలకు హెడ్మాస్టర్ పద్మజా ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో బచ్చు సురేష్, చుక్క శ్రీను, దీక్షితుల రవి, సిరిపురం రాజేశ్వరరావు, బండారు సత్యనారాయణ, మువ్వా రఘు, ఉదయ కుమారి, విజయ, లీలా, భారతి,ఝాన్సీ, యశోద, ఉష, జెమినీ శ్రీనివాస్, హరికృష్ణ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.