Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వరాష్ట్రంగా అవతరించాకే తెలంగాణ అభివృద్ధి
- సంక్షేమానికి ట్రేడ్‌మార్క్‌గా నిలుస్తున్నాం...
- ఏడాదికి నాలుగుసార్లు జెండా ఎగురవేసే ఘనతా మనదే..
- రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్
నవతెలంగాణ - ఖమ్మంకార్పొరేషన్
తెలంగాణ రాచరిక పాలన నుండి సెప్టెంబరు 17న ప్రజాస్వామ్య దశకు పరివర్తన చెందిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ అన్నారు. సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన నాటి నుంచి అరవై ఏండ్లు స్వీయ అస్థిత్వం కోసం ఉద్యమించామని తెలిపారు. స్వరాష్ట్రంగా అవతరించిన తర్వాత రాష్ట్రం అభివద్ధి పథంలో దూసుకుపోతున్నదన్నారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో మంత్రి పువ్వాడ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్ గౌరవ వందనంను స్వీకరించారు. ఉద్యమకారులు, స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించారు. దళితబందు పథకం ద్వారా మంజూరైన యూనిట్స్‌ను లబ్దిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీసు కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, అదనపు కలెక్టర్లు స్నేహలత, మధుసూదన్, నగర పాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ రాధికాగుప్తా, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, అయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.