Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రవాణాశాఖ మంత్రి పువ్వాడ
- అందుబాటులో వస్త్రాల ధరలు : ఎమ్మెల్యే సండ్ర
నవతెలంగాణ- సత్తుపల్లి
ఖమ్మం జిల్లాకే కాకుండా ఉభయ రాష్ట్రాలకు 'జీవీ మాల్' వస్త్రాలయ బ్రాండ్‌గా పేరు గాంచిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ అన్నారు. శనివారం సత్తుపల్లిలో జీవీ మాల్ వస్త్రాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ ద్వితీయశ్రేణి పట్టణాలకు జీవీ మాల్ విస్తరించడం సంతోషకరమన్నారు. ప్రజలకు అందుబాటులో ధరలను ఉంటున్నాయని, ఇదే ఒరవడిని కొనసాగిస్తూ జీవీ మాల్ మరింతంగా అభివృద్ధి చెందాలని పువ్వాడ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో జీవీ మాల్ ధరలు ఉంటాయనే పేరుందన్నారు. సత్తుపల్లి ప్రాంత ప్రజలకు మరింతంగా అందుబాటు ధరలతో దుస్తులు తీసుకురా వాలన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, కమిషనర్ కోడూరు సుజాత, భద్రాద్రి బ్యాంకు ఛైర్మెన్ చెరుకూరి కృష్ణమూర్తి, జీవీ మాల్ యాజమాన్య బాధ్యులు గుర్రం వాసు, గుర్రం ఉమామహేశ్వరరావు, గుర్రం మురళి, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ తోట సుజలారాణి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.