Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం నెరిపిన చరిత్ర కమ్యూనిస్టుల దని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం అన్నారు. చీమలపాడు లో సిపిఐ(ఎం) నాయకులు,మాజీ సర్పంచ్ మాలోత్ తావుర్యా 24వ వర్ధంతిని నిర్వహించారు. ఈసందర్బంగా మండల కార్యదర్శి కే.నరేంద్ర అధ్యక్షతన జరిగిన సభలో భూక్యా వీరభద్రం మాట్లాడుతూ పోరాటంతో ఎలాంటి సంబంధం లేని బీజేపీ, చరిత్రను వక్రీకరిస్తూ విమోచన దినమంటూ హడావిడి చేయటం విడ్డూరమని విమర్శించారు. అమరులైన మాలోత్ తావుర్యా లాంటి త్యాగధనుల పోరాటాల ఫలితంగా పేదల సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు. ఈసందర్భంగా పార్టీ జెండాను ఎర్రిపోతు నాగయ్య ఆవిష్కరించగా, తెలంగాణ సాయుధ పోరాట యోధులు రాచర్ల జయరామయ్య, కరపటి రాములు,బచ్చలనంద, పోతురాజు శేషయ్య చిత్రపటాలకు పూలమాలలు నివాళ్లు అర్పించారు. ఈ సభలో ప్రజానాట్యమండలి నాయకులు కరకపల్లి రాయమల్లు నాయకులు వల్లేబోయిన కొండలరావు, ధరావత్ రవికుమార్ యనమనగండ్ల రవి, సూరబాక సర్వయ్య, మాలోత్ రామకోటి, బానోత్ కిషన్, సీనియర్ నాయకులు మన్నెం బ్రహ్మయ్య, ఎరిపోతు భద్రయ్య, కొండ వెంకటేశ్వర్లు, అజ్మీర శోభన్ బాబు, సురభి నరేష్, మాలోత హనుమా, వాంకుడోత్ రామకోటి, పోతురాజు చందర్రావు, షేరు లలితమ్మ, రామకోటి, భారతలక్ష్మి, మాచర్ల రమేష్, మోకాళ్ళ జగన్, గోకర సైదులు, తావుర్యా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
సత్తుపల్లి : తెలంగాణ సాయుధ రైతాంగ పోరా టానికి కమ్యూనిస్టులే నాయకత్వం వహించారని సీపీఐ(ఎం) సత్తుపల్లి మండల కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాసరావు అన్నారు. సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో నాయకులు వేపులపాటి కుమారస్వామి అధ్యక్షతన నిర్వహించిన అమరవీరుల వారోత్సవ సభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. సమావేశంలో నాయకులు కొలికపోగు సర్వేశ్వరరావు, బండి వేలాద్రి, కేలోతు బిక్షం, రాంబాబు, చిట్టెమ్మ, పుష్పావతి, సత్యవతి, సమీనా, నాగేశ్వరరావు, విష్ణు, సురేశ్ పాల్గొన్నారు.
ఎర్రుపాలెం : కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో వీర తెలంగాణ సాయుధ పోరు బాటలో నిజాం పాలనపై తిరుగుబాటు చేశారని, అణిచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 1948 జనవరి 15న రజాకారులు జరిపిన దాడిలో మీనవోలు గ్రామానికి చెందిన ఏడుగురు అమరవీరులు అసువులు బాసారని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య ఆనాటి వారి త్యాగాన్ని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్స వాలలో భాగంగా సిపిఎం మండల కమిటీ ఆధ్వ ర్యంలో మీనవోలు గ్రామంలో గల అమర వీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. అదే గ్రామానికి చెందిన మధిర మా జీ సమితి అధ్యక్షులు స్వర్గీయ కామ్రేడ్ రామిశెట్టి పుల్లయ్య, ఆ గ్రామ మాజీ పంచాయతీ సర్పంచ్ మన్యం జానకి రామయ్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కుర్ర వెంకటరామయ్య, మొహద్దీన్, మేకల పుల్లయ్య, అంకాలరావు, ఉద్దండు, నండ్రు ప్రభుదాసు పాల్గొన్నారు.
ముదిగొండ : వీరతెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మండల పరిధిలో చిరుమర్రి గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల వారోత్సవం సిపిఐ (ఎం) ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చిట్యాల ఐలమ్మ చిత్రపటానికి పూలతో ఘనంగా నివాళులర్పించారు.అనంతరం జరిగిన సభలో ఐద్వా జిల్లా అధ్యక్షులు బండి పద్మ మాట్లాడుతూ రైతాంగ పోరాటంలో నైజాం రజాకార్లను తరిమిన ఘనత కమ్యూనిస్టులుదేనన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎందరో వీరులు రక్తతర్పణం చేశారన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) మండల నాయకులు కోలేటి ఉపేందర్, సామినేని రామారావు, ఎంపీటీసీ సభ్యురాలు కోలేటి అరుణ, గ్రామ నాయకులు మోర రామారావు,మోర గట్టమ్మ, నల్లగొండ యల్లేష్, బండి శేఖర్, వినుకొండ రాణి, పల్లపాటి లాలయ్య, శాంతమ్మ పాల్గొన్నారు.