Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేంసూరు
వేంసూరు మండలంలో పేదలకు భూములు పంచిన చరిత్ర కమ్యూనిస్టుల దేనని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు అన్నారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి లింగపాలెం గ్రామంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అమరజీవి ఎర్ర రామయ్య విగ్రహం వద్ద సీపీఎం మండల కమిటీ సభ్యులు మల్లూరు చంద్రశేఖర్ అధ్యక్షతన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విఠల్ మాట్లాడారు. ముందుగా పార్టీ జెండాను సీనియర్ నేత కొత్త సత్యనారాయణ ఆవిష్కరించారు. రామయ్య విగ్రహానికి మండల కార్యదర్శి అర్వపల్లి జగన్మోహన్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు మోరంపూడి వెంకటేశ్వరరావు, కొత్త జగ్గయ్య, ఎర్ర సత్యం, కేశవరావు, రాయల చెన్నారావు పాల్గొన్నారు.
పెనుబల్లి : తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్రమరువలేనిది అని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు చల మాల విట్టల్ రావు పేర్కొన్నారు. శనివారం విఎం బంజరలోని చలమల సూర్యనారాయణ భవన్లో వీర తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు తాండ్ర రాజేశ్వర రావు అధ్యక్షతన జరిగింది. ముందుగా తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాయం తిరుపతిరావు, మిద్దె స్వామి, మేకల బాజీ, నల్లమల ప్రతాప్, తిరుపతి రావు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం : పిండిపోలు గ్రామంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా పిండిపూరులో అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. సీపీఐ(ఎం) శాఖ కార్యదర్శి పప్పుల ఉపేంద్ర అధ్యక్షన జరిగిన సభలో పార్టీ మండల కార్యదర్శి కొమ్ము శ్రీను మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మహౌత్తర మైనదని అన్నారు. సిపిఎం సీనియర్ నాయకులు దొండేటి ఆనందరావు మాట్లాడుతూ పిండిప్రోలు గ్రామంలో 32 మంది అమరవీరులు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. వారసత్వాన్ని పునికిపుంచుకొని ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు అంగిరేకుల నరసయ్య, బింగి రమేష్, కాంపాటి బాబురావు, పద్మనాభల సుధాకర్ రావు, చామకూరి నాగభూషణం, దొండేటి నిర్మల్ రావు, తాతా కృష్ణయ్య, దొండేటి రామయ్య, పప్పుల ఉపేందర్, రాయిండ్ల సుందరయ్య, సొసైటీ డైరెక్టర్ చల్లా వెంకటేశ్వర్లు, రామనబోయిన రవి, పిట్టల పాపారావు, పాల్గొన్నారు.