Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంకార్పొరేషన్
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నగరంలోని న్యూవిజన్ పాఠశాలలో విద్యాసంస్థల అకడమిక్ డైరక్టర్ సిహెచ్.కార్తీక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ యండి. అబాద్ అలీ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ అబాద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ విమోచన కొరకు ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలు అమోఘమై నవని కొనియాడారు. కార్యక్రమంలో న్యూవిజన్ విద్యాసంస్థల ఏఓ వెంకటరెడ్డి, పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
రెహనా మెమోరియల్ ఐటిఐ కాలేజీలో తెలంగాణ విమోచన దినోత్సవం
ఖమ్మం : నగరంలోని రెహనా మెమోరియల్ ఐటిఐ కాలేజీలో శనివారం తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ వి శ్రీనివాసరావు, టౌన్ ప్లానింగ్ అధికారి భాస్కరరావు మాట్లాడారు.
విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టు వర్క్‌కు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
హార్వెస్ట్ టెండర్ రూట్స్ పాఠశాలలో జాతీయ సమైక్యత దినోత్సవం
ఖమ్మం : నగరంలోని హార్వెస్ట్ టెండర్ రూట్స్ పాఠశాలలో శనివారం జాతీయ సమైక్యత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ రవిమారుత్, ప్రిన్సిపల్ పార్వతీరెడ్డి జెండాను ఆవిష్కరించి జాతీయగీతాలాపన చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉద్యమ చరిత్ర, సాయుధ పోరాటానికి సంబంధించిన సాంస్కతిక నృత్య ప్రదర్శనలను ప్రదర్శించారు.
టైనిటాట్స్ హైస్కూల్లో జాతీయ సమైక్యత దినోత్సవ
ఖమ్మం : ఖమ్మం బస్‌డిపో రోడ్‌లోని టైనిటాట్స్ హైస్కూల్లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ సందర్బాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని పాఠశాల కరస్పాండెంట్ శెట్టి భాస్కర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సబిత, పర్వీన్, రాధాకృష్ణ, సురేష్, నాగేశ్వరరావు విద్యార్థులు పాల్గొన్నారు.
న్యూ ఇరా పాఠశాలలో తెలంగాణ జాతీయ సమైఖ్యతా దినోత్సవ వేడుకలు
ఖమ్మం : నగరంలోని న్యూ ఇరా స్ప్రింగ్స్ హైస్కూల్ లో శనివారం తెలంగాణ జాతీయ సమైఖ్యతా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ డాక్టర్ పి. భూమేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వి. భరత్ కుమార్, ఉపాధ్యాయ బందం పాల్గొన్నారు.
హార్వెస్ట్‌లో జాతీయ సమైక్యత దినోత్సవం
ఖమ్మం : నగరంలోని హార్వెస్ట్ పాఠశాలలో శనివారం జాతీయ సమైక్యత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ రవిమారుత్, ప్రిన్సిపల్ పార్వతీరెడ్డి జెండాను ఆవిష్కరించి జాతీయగీతాలాపన చేశారు. పాఠశాలలో తెలంగాణా ఉద్యమ చరిత్ర, సాయుధ పోరాటానికి సంబంధించిన సాంస్కతిక నృత్య ప్రదర్శనలను నిర్వహించారు. రాష్ట్రప్రభుత్వ పిలుపు మేరకు జాతీయ సమైక్యతా వేడుకలను పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు సిబ్బంది జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా నిర్వహించారు.
'సాయిస్ఫూర్తి'లో సమైక్యతా దినోత్సవం
సత్తుపల్లి : సత్తుపల్లి మండలం గంగారం సాయిస్ఫూర్తి ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వీఆర్ఎస్ కుమారి మాట్లాడుతూ నాటి చారిత్రక ఘట్టాలను వివరించారు. రాజ్యసభ సభ్యులు, కళాశాల ఛైర్మెన్, హెటెరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారధిరెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఛైర్మెన్ బండి అన్విద మాట్లాడుతూ యాజమాన్యానికి, విద్యార్ధులకు వర్చువల్‌గా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్‌రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ చెన్నుపాటి విజరుకుమార్, విభాగాధిపతులు డాక్టర్ షేక్ మీరాసాహెబ్, డాక్టర్ డీఎన్వీ కృష్ణారెడ్డి, అధ్యాపకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.