Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
తెలంగాణ పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్(సిఐటియు) రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుమ్మ విష్ణు వర్ధన్, కళ్యాణం వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం మంచి కంటి భవనంలో తెలంగాణ పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఆటో, కారు, ట్రాక్టర్, లారీ, డీసీఎం, జెసిబి, ప్రోక్లైన్ అలాగే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వివిధ రంగాల కార్మికులను ఐక్యం చేయడం కోసం అలాగే కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం వివిధ సందర్భాల్లో అనేక పోరాటాలు చేసి ఫిట్నెస్ చార్జీలు తగ్గించడం కానీ లైసెన్స్ ఫీజులు రవాణా చార్జీలు తగ్గించడంలో సిఐటియు సంఘం కీలకపాత్ర పోషించిందని తెలిపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను జిఎస్టిలోకి తీసుకు రావాలని, అలాగే ట్రాన్స్పోర్ట్ రంగా కార్మికుల కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్య లపై చర్చించే ందుకు మహాసభలు విజయ వంతం చేయాలని పిలుపు నిచ్చారు. ట్రాన్స్పోర్ట్ యూనియన్ జిల్లా కార్యదర్శి జిల్లా ఉపేందర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని మండలాల ప్రతినిధులు హాజరై ఈ మహాసభను విజయవంతం చేసి భవిష్యత్ కార్యక్రమాలు నిర్ణయం చేసుకొని ఈ మహాసభను విజయవంతం చేయాలని కార్మికులందరూ ఐక్యంగా ఉండాలన్నారు. సమావేశంలో ట్రాక్టర్ యూనియన్ జిల్లా కార్యదర్శి ధరవ రాందాస్, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు అమరయ్య, జెసిబి యూనియన్ అధ్యక్షులు వెంకట్, కార్ యూనియన్ జిల్లా నాయకులు బొట్ల విద్యాసాగర్, ఆటో యూనియన్ జిల్లా నాయకులు సంపత్ శ్రీను అలాగే డ్రైవర్లు పాల్గొన్నారు.