Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం పట్టణ కమిటీ డిమాండ్
నవతెలంగాణ-భద్రాచలం
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం పట్టణ కమిటీ సమావేశం ఆదివారం స్థానిక కార్యాలయంలో సోయం జోగారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎంపీ మీడియం బాబురావు, జిల్లా కార్యదర్శి సరియం, కోటేశ్వరరావు హాజరై మాట్లాడుతూ ఆదివాసీలకు ఉన్నటువంటి జీవో నెంబర్ 3 తిరిగి అమలు చేయాలని, అప్పుడే ఆదివాసులకు వంద శాతం ఉద్యోగాలు వస్తాయని అన్నారు. రాష్ట్రంలోని ఆదివాసీ జనాభా పెరుగుదలను బట్టి, రిజర్వేషన్ శాతం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. జనాభా గణాంకల్లోని ఆదివాసులకు ఆదర్శలో కాకుండా ప్రత్యేక కాలం కేటాయించాలి, అప్పుడు ఆదివాసులు జనాభా లెక్కలు కేటగిరి ప్రకారం వస్తాయన్నారు. ముఖ్యమంత్రి ఆదివాసి భవనం ప్రారంభోత్సవంలో ప్రకటించినటువంటి గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, భూమిలేని గిరిజనులకు గిరిజన బంధు పది లక్షలు ప్రకటించడమే కాకుండా తక్షణమే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆదివాసులకు న్యాయం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ ప్రజానీకానికి జవాబుదారితనంగా ఉండాలే గాని ఎన్నికలు వస్తున్నాయ కాబట్టి ప్రకటనలు చేస్తే ఆదివాసులు ఊరుకునే పరిస్థితి లేదన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో ముఖ్యంగా పోడు సాగుదారుల ఉన్నటువంటి రైతులకు పట్టాలు ఇవ్వాలని, పోడు సాగుదారుల మీద ఇటువంటి పోలీస్ కేసులు వెంటనే రద్దు పరచాలని, వారి మీద నిర్బంధాలు ఆపాలని, కానీ రాష్ట్ర ప్రభుత్వం 140 జీవో తేవడం జరిగిందని, ఆ జీవోలో ఎక్కడ కూడా పట్టాలిస్తామని లేదని అదే కాకుండా ఆ కమిటీలో స్థానికంగా పోడు చేసుకున్నటువంటి రైతులను తీసుకోవాలి. గతంలో ఉన్నటువంటి కమిటీ తీర్మానాలను పరిశీలించాలని కొత్త కమిటీలు అవసరం లేదు అన్నారు. ఆదివాసులందరికీ పట్టా పాస్ బుక్కులు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు సున్నం గంగా, కుంజ శ్రీను, కోళ్ల ప్రవీణ్, సున్నం ప్రవీణ్, రమణ, లక్ష్మి, భద్రమ్మ, గంగరాజు, తదితరులు పాల్గొన్నారు.