Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి
- తెల్లం వెంకట్రావు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం గిరిజన అభ్యున్నతి కోసం పనిచేస్తున్న బాంధవుడని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు అన్నారు. ఆదివారం లక్ష్మీ నగరం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రపటానికి పాలభి షేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన జాతి అభ్యున్నతి కోసం కోమరంభీం భవన్, సేవాలాల్ బంజారా భవన్లను రాజధాని నడి బొడ్డున నిర్మించి గిరిజన జాతులకు అంకితం చేశారన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు అమలుచేసేందుకు గతంలోనే తెలంగాణా అసెంబ్లీలో తీర్మానించి పంపటం జరిగినప్పటికీ కేంద్రం అ బిల్లు మీద ఇప్పటికీ సరైన నిర్ణయం తీసుకోక పోవటం వల్ల అ బిల్లు ఆగిపోయిందని అన్నారు. భూమిలేని నిరుపేద గిరిజన కుటుంబాలకు దళిత బంధు మాదిరిగానే గిరిజన బంధు పది లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించటం పట్ల పోడు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షకార్యదర్శులు ఆన్నే సత్యనారాయణ మూర్తి, కణితి.రాముడు, చర్ల మండల పార్టీ అధ్యక్షులు సోయం. రాజారావు, జెడ్పిటిసి తెల్లం సీతమ్మ, మండల అధికారప్రతినిది ఎండి జానీ పాషా, ఉపాధ్యక్షులు తునికి కామేష్, ఎంపీటీసీలు తెల్లం భీంరాజు, మడకం రామారావు, సోదె. తిరుపతిరావు, పీఎసిఎస్ డైరెక్టర్ వెంకటేష్, దామెర్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు.