Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా తెలంగాణ జాతీయ సమైఖ్యతా వజోత్సవ వేడుకలు
- ముగింపు సభలో జిల్లా కలెక్టర్ ఆనుదీప్,
- ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరావు, హరిప్రియ
- అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
నవతెలంగాణ-కొత్తగూడెం
హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో ఐక్యం చేయడానికి కృషి చేసిన మహానీయుల త్యాగాలు నేటి తరాలకు తెలియచేసేందుకు ప్రభుత్వం మూడు రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైఖ్యతా వజోత్సవ కార్యక్రమాలు నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు, ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ తెలిపారు. ఆదివారం తెలంగాణ జాతీయ సమైఖ్యతా వజ్రోత్సవాలు ముగింపులో భాగంగా స్థానిక కొత్తగూడెం క్లబ్బులో స్వాతంత్య్ర సమర యోధులకు, కవులకు, కళాకారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడారు. 17 సెప్టెంబర్ 1948లో తెలంగాణ నాటి హైదరాబాదు సంస్థానం భారతదేశంలో ఐక్యమైనట్లు చెప్పారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను లెక్కచేయకుండా పోరాటం చేసిన మహానాయుకుడు కెసిఆర్ అని కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలులో మన రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నట్లు చెప్పారు. 17వ తేదీ శనివారం హైదరాబాదులో సంతుసేవాలాల్, కొమరం భీం ఆదివాసీ భవనాల ప్రారంభోత్సం చేసుకోవడం అనంద దాయకం అన్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోదులు, తెలంగాణ పోరాట యోధులను, కవులు, కళాకారును, ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం, ఇల్లందు మున్సిపల్ చైర్మన్లు కాపు సీతాలక్ష్మి, డి.వెంకటేశ్వర్లు, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ ధర్మరాజు, డిపిఆర్డీ శీలం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.