Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 26న కలెక్టరేట్ కార్యాలయం ధర్నా
- అఖిల పక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
నవతెలంగాణ-కొత్తగూడెం
షెడ్యూల్ పరిశ్రమలలో కార్మికుల కనీస వేతనాలు జీఓలను సవరించి, విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26న జరిగే కలెక్టర్ కార్యాలయం ధర్నా నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సీఐటియూ, ఏఐటియూసీ, ఐఎఫ్టియూ, ఐఎఫ్టియూ, ఐఎఫ్టియూ జిల్లా కార్యదర్శులు ఎ.జె.రమేష్, గుత్తుల సత్యనారాయణ, ఎల్.విశ్వనాథం, పి.సతీష్, సారంగపాణిలు స్పష్టం చేశారు. కొత్తగూడెంలో సీఐటియూ జిల్లా కార్యాలయంలో గుత్తుల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అఖిల పక్ష కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు దగ్గర నుండి నేటి వరకు షెడ్యుల్ పరిశ్రమలలో పని చేస్తున్న కార్మికులకు జీఓలను సవరించలేదన్నారు. ఈ జీఓల సవరణ వల్ల ప్రభుత్వానికి ఒక్క రూపాయి భారం కూడా పడదన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జీవోలు సవరించి, విడుదల చేయడం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో సీఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు యర్రగాని కృష్ణయ్య, డి.వీరన్న, ఏఐటియూసీ నాయకులు పిట్టల రామచందర్, ఇప్ల్యూ నాయకులు ప్రసాద్, కె. సురేందర్, కిషన్, సిఐటియూ నాయకులు శ్యామ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.