Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రక్షణ లేకుండా తరలింపు
- ఆందోళనచెందుతున్న విద్యార్థులు తల్లిదండ్రులు
- అధికారుల నిర్వకంపై మండి పడుతున్న ప్రజలు
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెంలో క్లబ్లో జరుగుతున్న జాతీయ సమైక్యత ముగింపు వేడుకలకు బీసీ హాస్టల్ విద్యార్థులను తీసుకు వచ్చారు. ఒక్క ట్రాలీలో సుమారు 50 మందిని ఎక్కించి తీసుకు రావడం విమర్శలకు దారి తీసింది. ఏదైన ప్రమాదం సంభవిస్తే ఏమిటని ప్రశ్నిస్తున్నారు...? ముఖ్యంగా జిల్లా బీసీ సంక్షేమ, హాస్టల్స్ అధికారుల నిర్వాకంపై పలువురు మండి పడుతున్నారు. ఈ కార్యక్రమానికి పాఠశాలలు, హాస్టల్స్ నుండి విద్యార్థులను అధిక సంఖ్యలో తరలించాల్సిందిగా అధికారులు హాస్టల్ వార్డెన్లకు, ప్రధానోపాధ్యాయులకు బిసీ జిల్లా సంక్షేమ అధికారి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఎలాంటి సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతాల్లో ఉన్న పిల్లలను చదువు కోసం హాస్టల్స్లో ఉంచామని, ఇలా ప్రమాదకరంగా వాహనాల్లో కూలీలను తరలించిన తీరుగా తరలించడం పట్ల విద్యార్థులు తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి రక్షణ లేకుండా ట్యాలీలో తరలించడం సర్వత్రా విమర్శలు కుప్పిస్తున్నారు.
ఒక్క ట్రాలీలో 50 మంది..
విద్యార్థులను తరలించే క్రమంలో భాగంగా రామవరం బీసీ హాస్టల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికలను ఓకే ట్రాలీలో సుమారు 50 మందిని పశువుల మాదిరిగా తరలించి మానవత్వం మరిచారు. ఇదే కోవలో చుంచుపల్లి విద్యార్థులను సైతం తరలిస్తుండగా చూసిన పట్టణ వాసులు మండిపడ్డారు. విద్యార్థులను తరలించడానికి కనీసం ఒక బస్సు ఏర్పాటు చేయలేకపోయిన అధికారుల పని తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిమితికి మించి విద్యార్థులను తరలించే క్రమంలో ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని పట్టణ ప్రజలు కోపోద్రిక్తులవుతున్నారు.