Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ముమ్మాటికి దేశద్రోహులే..
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
నిజమైన దేశభక్తులు కమ్యూనిస్టులేనని, బీజేపీ ముమ్మాటికి దేశద్రోహులేనని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో, దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ పాత్ర శూన్యమని, విమోచన కాదు.. విలీనమేనని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్ స్పష్టం చేశారు. ఆదివారం సీపీఐ(ఎం) పట్టణ కమిటీ అధ్వర్యంలో హనుమాన్ బస్తీ నందు వీర తెలంగాణ సాయుధ పోరాట అమరులకు ఘనమైన నివాళులర్పించి, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య, చిట్యాల ఐలమ్మ, చిత్ర పటాలకు పూలమాలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్ మాట్లాడుతూ కమ్యూనిస్టు నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలను పేదలను ఐక్యం చేసి నైజాం, నవాబ్ రజాకార్లను తరిమివేశారన్నారు. బాంచన్ దొర, నీ కాల్మొక్తా... అనే బడుగు వర్గాలను బంధూకులు చేత పట్టించి నైజాం నవాబు రజా కారులను తన్ని, తరిమిన చరిత్ర కమ్యూనిస్టులదేనన్నారు. తెలంగాణ సాయుధ రహితంగా తొలి అమరుడు దొడ్డి కొమురయ్య, చిట్యాల ఐలమ్మ, పుచ్చలపల్లి సుందరయ్యల స్ఫూర్తితో మతోన్మాద బిజెపిపై ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులూ ఎన్ఎస్.రాజు, సూరం ఐలయ్య, వై.వెంకటేశ్వర రావు, రింగు వెంకటయ్య, గుగులోతు సక్రామ్, రాజ్ కుమార్, భూక్యా జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.