Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహాసభలకు హాజరుకానున్న 500 మంది ప్రతినిధులు
- విలేకరుల సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మంలో నవంబర్ 4, 5, 6 తేదీలలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు ఆదివారం ఖమ్మంలోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగం కుదేలై సంక్షోభంలో కురుకుపోయిందన్నారు. పంటకు గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడి రాక రైతులకు ఆత్మహత్యలే శరణమవుతున్నాయని, రైతులతో పాటు వ్యవసాయ కూలీలు కూడా దారుణమైన పరిస్థితులలో ఉన్నారని అన్నారు. అదానీ ప్రపంచ కుబేరులలో 3వ స్థానానికి ఎగబాకాడని, అతని రోజువారీ సంపాదన 1,000 కోట్ల రూపాయలు అని, మరోవైపు సమాజంలో ఆకలి, దరిద్రం, నిరుద్యోగం పెరిగి పేదలు మరింత పేదలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.వ్యవసాయ కార్మికులకు తిండి, బట్ట, ఇల్లు, విద్య, వైద్యం లాంటి కనీస సౌకర్యాలు కూడా అందడం లేదన్నారు.
ఈ దశలో వ్యవసాయ కార్మికుల జీవన పరిస్థితుల మెరుగుకై, రైతుల సమస్యల పరిష్కారానికై వ్యవసాయ కార్మిక సంఘం కృషి చేస్తోందని, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవటానికి తగిన చర్చలు జరిపి మార్గాన్ని నిర్దేశించుకోవడానికై ఈ మహాసభ జరుగుతుందన్నారు. ఈ మహాసభల సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తు న్నామని, ఈ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరరు విజయన్ కూడా పాల్గొంటు న్నారని తెలిపా రు. తమ దళాలు జిల్లాలోని గడపగడపకు రానున్నాయని, అదే విధంగా సోమవారం ఖమ్మంలోని తమ దళాలు గడపగడపకు వస్తారని వారికి ఆర్థికంగా సహాయ సహకారాన్ని అందిం చాలని కోరారు. ఈ మహాసభల్లో పలు తీర్మానాలు చేయనున్నామని తెలిపారు. ఈ మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. నవంబర్ 4న జరిగే బహిరంగ సభ లక్ష మంది జనంతో నిర్వహిస్తామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు ప్రతాపనేని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.