Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకు ఎంపీ నామ స్పష్టీకరణ
- ఎంపీని కలిసి వినతిపత్రం అందజేసిన పామాయిల్ రైతులు
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
రైతుల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, పామాయిల్ రైతులను అన్ని విధాలా అదుకునేందుకు సీఎం కేసీఆర్తో మాట్లాడి, సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మంలోని ఎంపీ స్వగృహ ంలో అశ్వారావుపేట, దమ్మపేట, సత్తుపల్లి ప్రాంతాలకు చెందిన పామాయిల్ సాగు రైతులు ఎంపీ నామను కలసి, సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి నామ మాట్లాడుతూ తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను సత్వరమే సీఎం కేసీఆర్కు తెలియజేసి, పరిష్కారా నికి చర్యలు తీసుకు ంటానని అన్నారు. కొన్ని అంశాలు కేంద్రం పరిధిలో ఉన్నందున వాటి విషయంలో ఏమి చేయాలన్న దానిపై సంబంధిత మంత్రితో మాట్లాడతానని అన్నారు. పామాయిల్ సాగును కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారని అన్నారు. రైతులకు కూడా ఎన్నో ప్రోత్సాహాకాలను కూడా ఇస్తూ రైతులను అదుకుంటున్నారని పేర్కొన్నారు. అయితే గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందన్నారు. ప్రపంచ మార్కెట్లో వస్తున్న ఒడిదుడుకులు వల్ల సరైన మద్దతు ధర లభించడం లేదని ఈ సందర్భంగా రైతులు ఎంపీ దృష్టికి తీసుకెళ్ళారు. ఖచ్చితమైన మద్దతు ధర ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. ప్రపంచ మార్కెట్లో హెచ్చుతగ్గులు వల్ల మద్దతు ధర లభించక నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఖచ్చితమైన రీతిలో టన్నుకు రూ.15 వేల నుంచి 20 వేల మధ్య మద్దతు ధర లభించేలా కేంద్రంతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని రైతులు ఎంపీని కోరారు. ఎంపీని కలిసిన వారిలో తెలంగాణ పామాయిల్ రైతు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆళ్లపాటి ప్రసాద్, నాయకులు పూర్ణచంద్రారెడ్డి, జేవీ రమణరావు, కాసాని చంద్రమోహన్, తలశిల ప్రసాద్, చిన్నంశెట్టి సత్యనారాయణ. మాటూరి మోహన్, అంకత ఉమామహేశ్వరరావు, తుంబూరు ఉమామహేశ్వరరెడ్డి, దమ్మపేట జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, మాజీ జెడ్పిటిసి దొడ్డాకుల రాజేశ్వరరావు తదితరులతో పాటు రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావుపాల్గొన్నారు.