Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్
నవతెలంగాణ- ఖమ్మం
కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు నిర్వహిస్తున్న భారత్ జోడో పాదయాత్ర అక్టోబరు 20వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తెలిపారు. ఆదివారం ఖమ్మంలోని సంజీవరెడ్డి భవనం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏఐసీసీ మాజీ అద్యక్షులు రాహుల్ గాంధీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు నిర్వహిస్తున్న భారత్ జోడో పాదయాత్ర అక్టోబరు 20వ తేదీ తరువాత తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని, ఖమ్మం జిల్లా నుండి అధిక సంఖ్యలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాహుల్ గాంధీతో అడుగులో అడుగు వేసి పాదయా త్రను విజయ వంతం చేయాలన్నారు. ఈ పాదయాత్రలో ఖమ్మం జిల్లా నాయకు లకు ఒకరోజు కేటాయి స్తారని, యాత్రలో పాల్గొనే వారందరు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, పాస్ పోర్టు సైజు ఫోటో, మీ మొబైల్ నంబర్‌ను జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో అందజేయాలని తెలిపారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటి అద్యక్షులు మహ్మద్ జావేద్, నగర కాంగ్రెస్ కార్యనిర్వాహక అద్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, కొణిజర్ల మండల కాంగ్రెస్ అద్యక్షులు వడ్డే నారాయణరావు, నగర కాంగ్రెస్ కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వరరావు, పల్లెబోయిన భారతి చంద్రం, మహ్మద్ రఫేదా భేగం, లకావత్ సైదులు నాయక్, గడ్డం వెంకటయ్య, నాగటి చంద్రం, ఖమ్మం నగర కాంగ్రెస్ నాయకులు యస్‌కె జహీర్, మహ్మద్ గౌస్, మహమూద్, అబ్బాస్, అబ్దుల్ ఆహాద్ తదితరులు పాల్గొన్నారు.