Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చరిత్రను వక్రీకరిస్తున్న బిజెపి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు
నవ తెలంగాణ- చింతకాని
భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడింది కమ్యూనిస్టులు మాత్రమేనని సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ ముగింపు సందర్భంగా శనివారం రాత్రి నాగలవంచ సిపిఎం పార్టీ కార్యాలయం నుండి ప్రధాన రహదారిలోని అనగాని ఎల్లయ్య విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పొన్నం మాట్లాడుతూ భూస్వాములు, దొరలు, రజాకారుల అండతో పేదలపై దాడి చేస్తూ వెట్టిచాకిరి చేయించుకుంటున్న తరుణంలో ఎర్రజెండా నాయకత్వంలో కమ్యూనిస్టులు వెట్టి చాకిరీని రద్దు చేయాలని, దున్నేవారికి భూమి దక్కాలని సాయుధ పోరాటం నిర్వహించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, మండల కమిటీ సభ్యులు వత్సవాయి జానకిరాములు, తోటకూరి వెంకట నరసయ్య, ఆలస్యం రవి, మునుకుంట్ల సుబ్బారావు, నాయకులు యరదేశి గోపాలరావు, కందరబోయిన కొండలరావు తదితరులు పాల్గొన్నారు.