Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యులు డాక్టర్ చీకటి భారవి, ఖమ్మం నేత్ర నిధి హనుమంతరావు.
- 87వ నెల బోడేపుడి వైద్య శిబిరం విజయవంతం
నవతెలంగాణ - వైరా టౌన్
మనిషి మరణాంతరం నేత్ర దానం చేసి ఇతరులకు వెలుగు చూపాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ చీకటి భారవి, ఖమ్మం నేత్ర నిధి హనుమంతరావు పిలుపు నిచ్చారు. వైరా బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో ప్రతినెల మూడోవ ఆదివారం నిర్వహించే వైద్య శిబిరాన్ని 87వ నెల విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చీకటి భారవి, హనుమంతరావు వైద్య శిబిరానికి హాజరైన ప్రజలకు నేత్రదానంపైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనిషి మరణాంతరం నేత్రదానం చేయడం ద్వారా కంటి చూపు కల్పించే అవకాశం ఉంటుందని, మనిషి చనిపోయిన ఎనిమిది గంటల లోపు నేత్రదానం ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. ప్రజలకు నిరంతరం ఉచిత వైద్య సేవలు అందించడంలో బోడేపూడి వైద్య శిబిరం చేస్తున్న ఆదర్శవంతమైన కృషిని అభి నందించారు. వైద్య శిబిరంలో డాక్టర్ చీకటి భారవి, డాక్టర్ జట్ల రంగారావు, డాక్టర్ పిల్లులమర్రి సుబ్బారావు వైద్య సేవలు అందించారు. ఆదివారం వైద్య శిబిరంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో బోడేపూడి కళా నిలయం సంస్థ కార్యదర్శి బొంతు రాంబాబు, సుంకర సుధాకర్, తోట నాగేశ్వరావు, బొంతు సమత, గుడిమెట్ల రజిత, గుడిమెట్ల మెహన్ రావు, మాదినేని రజనీ, కంభంపాటి సత్యనారాయణ, అనుమోలు రామారావు, ఐలూరి శ్రీనివాసరెడ్డి, శీలం నారాయణరెడ్డి, యనమద్ది రామకృష్ణ, గూడూరు రమణారెడ్డి, జగదీష్, మందడపు నాగేశ్వరరావు, దూళ్ళిపాళ్ళా రవి, కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.