Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- పెనుబల్లి
గిరిజనుల స్వపరిపాలన సౌలభ్యం కోసం తండాలను పంచాయ తీలుగా ఏర్పాటు చేసి గిరిజనుల ముంగిట్లో అభివృద్ధికి పెద్దపీట వేసిన తెలంగాణ ప్రభుత్వాన్ని, కెసిఆర్‌ని ప్రజలు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఆదివారం పెనుబల్లి మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండ్రుపాడు, సూరయ బంజరతండ, అడవిమల్లెల, చౌడారం గ్రామాల్లో గ్రామ సభలు జరిగాయి. ప్రజలు గ్రామ కూడళ్లలో మేళతాళాలతో పూలమాలలతో ఎమ్మెల్యే సండ్రకు ఘన స్వాగతం పలికారు. సూరయ బంజర తండాలో కెసిఆర్ చిత్రపటానికి గిరిజన మహిళలు ఎమ్మెల్యే సండ్రతో కలిసి పూలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆర్ఐ శ్రీనివాస్, పిఆర్‌జెఇ. జెడ్పీటీసీ చక్కిలాల మోహన్‌రావు, కల్లూరు మార్కెట్ కమిటీ చైర్మన్ చక్కిలాల లక్ష్మణరావు, నీలాద్రి ఆలయ కమిటీ చైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరరావు, టిఆర్ఎస్ నాయకులు కనగాల వెంకట్రావు, చీకటి రామారావు, సూర్యదేవర రవికుమార్, బెల్లంకొండ చలపతి, తాళ్లూరు శేఖర్‌రావు, ముక్కల భూపాల్ రెడ్డి, కనగాల సురేష్ బాబు, లగడపాటి శ్రీనివాస్, మోరంపూడి రామారావు, మందడపు అశోక్ పాల్గొన్నారు.