Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మంకార్పొరేషన్
భద్రాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక వాసవి గార్డెన్స్ కళ్యాణ మండపంలో ఆదివారం భద్రాది బ్యాంకు రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజరు కుమార్, ఖమ్మం లోక్ సభ సభ్యులు నామ నాగేశ్వరరావు, విశిష్ట అతిధిగా రాజ్య సభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , గౌరవ అతిధిగా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రావులు పాల్గొన్నారు. ఈ సభకు భద్రాద్రి బ్యాంకు చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి అధ్యక్షత వహించగా వైస్ చైర్మన్ సన్నే ఉదరు ప్రతాప్, వేములపల్లి వెంకటేశ్వరరావు, భద్రాద్రి బ్యాంక్ సీఈవో ముక్కామల వెంకటకామేశ్వరరావులు వేదికను అలంకరించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ 1997 అక్టోబర్ 4న ఖమ్మం పుర ప్రముఖులతో ప్రారంభమైన భద్రాద్రి బ్యాంకు దినదిన ప్రవర్ధమానమౌతూ ఎదిగి ఈనాడు 16 శాఖలతో తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉత్తమమైన బ్యాంకుగా పేరు పొంది ఖాతాదారులందరికీ ఇష్టమైన బ్యాంకుగా రూపు దాల్చిందని అని అన్నారు. దీనికంతటికి భద్రాది బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి కృషినే కారణమన్నారు. బ్యాంకు డైరక్టర్ల పూర్తి సహకారాలు, వాటాదారుల మరియు ఖాతాదారుల అచంచల విశ్వాసం మరో కారణమని అన్నారు.ఎంపీ నామ మాట్లాడుతూ అనతి కాలంలోనే బ్యాంకు మంచి పేరును సంపాదించిందని కొనియాడారు. రాజ్య సభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ చెరుకూరి కృష్ణమూర్తి అందరికీ కావాల్సిన వ్యక్తి అని, ఆయన పేరునమ్మకానికి మారుపేరని, ఈ బ్యాంకు భవిష్యత్తులో ఇంకా ఎదగాలని అభిలా షించారు. చెరుకూరి కృష్ణమూర్తి మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగం అనేక ఒడిదు డుకులు ఎదుర్కొంటున్న తరుణంలోనూ భద్రాద్రి బ్యాంకు సగర్వంగా నిలబడి ప్రగతిపథంలో ముందుకు నడుస్తోందని అన్నారు. అనంతరం భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తిని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బ్యాంకు డైరక్టర్ రేఖల భాస్కర్, నగర మేయర్ పునుకోల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి ప్రసన్న, బ్యాంకు వైస్ చైర్మన్లు, మరియు పాలక మండలి సభ్యులు, భద్రాద్రి బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.