Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్
నవతెలంగాణ- సత్తుపల్లి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగే సమయంలో మీ ఉనికి లేదని, ఎవరైనా పాల్గొని ఉంటే ఒక్కరి పేరైనా చెప్పే దమ్ముందా అంటూ బీసీ సంఘం జిల్లా వర్కింగ్ నారాయణవరపు శ్రీనివాస్ మండిపడ్డారు. చాకలి ఐలమ్మపై బీజేపీ నాయకుడు ప్రకాశ్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం సత్తుపల్లిలోని రింగుసెంటరులో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఐలమ్మ పోరాట పటిమను చిట్టెలుకతో పోల్చిన ప్రకాశ్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడారు. రజకుల ఆరాధ్యురాలైన ఐలమ్మను విమర్శిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆమె వారసులు చూస్తూ ఊరుకోరని శ్రీనివాస్ హెచ్చరించారు. ప్రకాశ్‌రెడ్డి వ్యాఖ్యలపై బండి సంజరు గాని, ఎంపీ అరవింద్ గాని స్పందించకపోవడం బాధాకర మన్నారు. రజకులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్విజరుకుమార్, సీపీఐ నాయకులు రామకృష్ణ మద్దతు తెలుపుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రజక సంఘ నాయకులు మరికంటి శ్రీను, విరివాడ నాగభూషణం, రాము, చింతల సత్యనారాయణ, టోపీ శ్రీను, రాయల కోటి, కోటా రామ్మూర్తి, సాంబ పాల్గొన్నారు.