Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
సీఎం కేసీఆర్ పెంచిన రూ.2000 జీవో కాపి విడుదల చేయాలి మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షులు జి.పద్మ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు యంవి.అప్పారావులు డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ మధ్యాహ్నం భోజన పథకం కార్మికుల యూనియన్ సీఐటీయూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అదనపు కలెక్టర్ కె.వెంకటేశ్వర్లుకి అందజేశారు. డిమాండ్స్‌పై అధికారులకు పంపిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కోశాధికారి రామలక్ష్మి అధ్యక్షత జరిగిన సభలో వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా రూ.2000లు జీతాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. నేటికీ జీవో కాపి విడుదల చేయలేదన్నారు. రావాల్సిన బిల్లులు జీతాలు నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారని తెలిపారు. మెనూ చార్జీలు పిల్లవాడు కొచ్చి రూ.15లు పెంచాలని, కాటన్ బట్టలు యూనిఫామ్‌గా ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్డి.సుల్తానా, కార్మికులు, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శిలు, వెంకట నర్సమ్మ, రామలక్ష్మి, అరుణ, సీతమ్మ, సుజాత, లక్ష్మి, శైలజ తదితరులు పాల్గొన్నారు.