Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 32వ రోజు చేరిన జేఏసీ రిలే నిరాహార దీక్షలు
నవతెలంగాణ-బూర్గంపాడు
బూర్గంపాడు మండలంలోని గోదావరి ముంపుకు గురైన ప్రాంతాలకు పోలవరం ప్యాకేజీ కేటాయించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 32వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దీక్షలో నియోజకవర్గ అధ్యక్షులు ఇర్పా రవి కుమార్, జిల్లా మహిళా కన్వీనర్ వీణ, నియోజక వర్గ మహిళా కన్వీనర్ సాధన, జిల్లా ప్రధాన కార్యదర్శి జున్ను రవికుమార్, కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు జయంత్, భద్రాచలం నియోజకవర్గ అధ్యక్షుడు వీరస్వామి, కేసుపాక కృష్ణ, దామో దర దాము, ఎస్.కెగౌస్యబేగం, ఎస్.కె రహి మున్నీసాబేగం, శనగ గోపయ్య, నరేష్, దామోదరం తదితరులు కూర్చున్నారు. ఈ దీక్షలో కూర్చున్న వారికి జేఏసీ కన్వీనర్ కే.వి రమణ, ప్రధాన కార్యదర్శి దామర శ్రీను వారికి పూల మాలలు అందించి దీక్షను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి జున్ను రవికుమార్, పినపాక నియోజకవర్గ అధ్యక్షుడు ఇర్పా రవి కుమార్, కే.కరుణాకర్, స్వేరో ఉపాధ్యక్షుడు బూర్గుల కరుణాకర్, డీఎస్పీ జిల్లా కన్వీనర్ మధుమహారాజ్, వెంకట మహారాజ్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, వైయస్సార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.