Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
గిరిజనులకు రిజర్వేషన్లను ఇవ్వాలని అసెంబ్లీలో ప్రకటన చేసిన సీఎం కేసీఆర్ అసలు సిసలైన గిరిజన ఆరాధ్య దైవం అని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు సోయం రాజారావు, నక్కిన బోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం స్థానిక పంచాయతీ కార్యాలయం ఆవరణలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. బంజారాలకు, ఆదివాసీలకు వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్‌కి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. గిరిజనులకు ఆత్మ గౌరవ భవనాలను నిర్మించడంతోపాటు, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, గిరిజన బంధు, పోడు వ్యవసాయ హక్కులు కల్పిస్తూ జీవో ఇవ్వడం కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు ఖరారు చేసినందున కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం సర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు, ఎస్టీ సెల్ నాయకులు కాపుల నాగరాజు ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు పోలిన లంక రాజు, ప్రచార కార్యదర్శి కోటేరు శ్రీనివాసరెడ్డి, బిసి సెల్ అధ్యక్షుడు దొడ్డి సూరిబాబు, పీఏసీఎస్ డైరెక్టర్ ముమ్మినేని అరవింద్, ఎస్సీ సెల్ అధ్యక్షులు తోటమల్ల వరప్రసాద్, మండల యుత్ అధ్యక్షుడు కాకి అనిల్, టౌన్ ప్రెసిడెంట్ ముమ్మినేని సత్య సంపన్, ఎంపీటీసీ మిడియం శోభారాణి, మహిళా అధ్యక్షురాలు పోలూరి సుజాత, సర్పంచ్ కోరం నాగేంద్ర, సీనియర్ నాయకులు ఇరస వడ్ల రాము, రాజబాబు, సోమరాజు తదితరులు పాల్గొన్నారు.