Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
స్థానిక జగదాంబ సెంటర్లో ఇల్లందు రెవిన్యూ డివిజన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల దీక్షల్లో భాగంగా ఇల్లందు రెవిన్యూ డివిజన్ సాధన కమిటీ చైర్మెన్, మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య ప్రారంభించి, మాట్లాడారు. 150 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగినా ఇల్లందు ప్రాంతాన్ని రెవిన్యూ డివిజన్ చెయ్యాలని, అదేవిధంగా కొమురారం, బోడు సుధీమల్లా ప్రాంతాలను కొత్త మండలలుగా ప్రకటిస్తూ గుండాల, అల్లపల్లి, ఇల్లందు, టేకులపల్లిని కలుపుకొని ఈప్రాంతనికి భౌగోళిక స్వరూపాన్ని ఏర్పాటు చేయాలని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ప్రాంతాన్ని రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించి అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఈ ప్రాంత శాసనసభ్యులకు ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాంతాన్ని వెంటనే రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించడం కోసం ఈ విషయాన్ని శాసన సభ్యురాలు వెంటనే సీఎం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సాధన కమిటీ కన్వీనర్ అబ్దుల్ నబి, కాంగ్రెస్ జిల్లా నాయకులు లక్కినేని సురేందర్, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు యాకయ్య, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఏపూరి బ్రహ్మం దీక్షలో పాల్గొన్న సభ్యులు కాంగ్రెస్ పార్టీ మండల పట్టణ అధ్యక్షుడు పులి సైదులు, కొమరారం సర్పంచ్ కృష్ణవేణి, టీడీపీ పార్లమెంటు కమిటీ సభ్యుడు ముద్రగడ వంశీ, ప్రజా లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బట్టు శ్రీనివాస్, వైయ స్సార్ తెలంగాణ పార్టీ ఇల్లందు నియోజకవర్గ బాధ్యు లు రాములు, తదితరులు పాల్గొన్నారు. సంగిభా వంగా ప్రముఖ వైద్యులు శంకర నాయక్, కొమురా రం ఎంపీటీసీ అజ్మీర్ బిచ్చా, ఇన్సాఫ్ కమిటీ జిల్లా నాయకులు జలాల్ మహమ్మద్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కాలంగి హరికృష్ణ, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పృథ్వి, మైనార్టీ విభాగం నుండి సిరాజ్ ఖాన్, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు యాకూబ్ షావలి తదితరులు సంఘీభావం తెలిపారు.