Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి డైరెక్టర్ (పా) చంద్రశేఖర్‌కు వినతి
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మందా నర్సింహారావు
నవతెలంగాణ-కొత్తగూడెం
కాంటాక్ట్ కార్మికుల జీతాల పెంపుదల కోసం జరుగుతున్న సమ్మెపై సింగరేణి కాలరీస్ ఎంప్లా యిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు, రాష్ట్ర కార్యదర్శి భూపాల్‌లు సింగరేణి డైరెక్టర్ (పా) చంద్రశేఖర్‌కి హైదరాబాదులో సింగరేణి భవన్లో సోమవారం కలిసి మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సమ్మెను దృష్టిలో పెట్టుకొని కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచాలని, సింగరేణి లాభాల కోసం పాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల బాధలు అర్థం చేసుకొని లాభాల్లో వాటా, జీతాల పెంపుదల తదితర సమస్యలు వెంటనే పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని విజ్ఞప్తి చేశారు. దానిపై డైరెక్టర్ (పా) స్పందిస్తూ ప్రభుత్వము జీవోలు అమలు చేస్తున్నామని తెలియజేశారు. దానిపై యూనియన్ నాయకులు ప్రభుత్వ జీవోలు చేసి గెజిట్ చేయకపోవడం వల్ల ఆలస్యం అయినందుకు కార్మికుల్లో అసంతృప్తి నెలకొన్నదని, ప్రభుత్వంపై ఒత్తిడి చేయాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్యంపై ఉన్నదన్నారు.