Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రజావాణిలో సమస్య పరిష్కారానికి ప్రజలు అందచేసిన దరఖాస్తులు ఆధారంగా అధికారులు తగు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదు దారునికి సమస్య పరిష్కార స్వభావంపై లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని చెప్పారు. పరిష్కరానికి అవకాశం లేనట్లయితే అదే విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తూ లిఖితపూ ర్వకంగా తెలియచేయాలని చెప్పారు. పరిష్కరించ కుండా పెండింగ్ ఉంచొద్దని ఆయన పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుండి ప్రజా సమస్యను తెలియచేస్తూ ప్రజావాణిలో ప్రజలు దరఖాస్తులు అందజేశారు. ఆయన శాఖల అధికారులకు ఎండార్స్ చేసి పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ పీడీ మధుసూదన్ రాజు, జడ్పీ సిఈఓ మెరుగు విద్యాలత, డిపిఓ లక్ష్మీ రమాకాంత్, డిసిఓ వెంకటేశ్వర్లు, ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూర్య, సంక్షేమ అధికారి వరలక్ష్మి, ఇంటర్మీడియట్ అధికారి సులోచనారాణి. డిఈఓ సోమశేఖరశర్మ, డిఆర్డీ అశోకచక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టన్ను సస్పెండ్ చేయాలి
గర్భిణీ ప్రియాంక మృతికి కారణమైన డాక్టర్ సరళను తక్షణమే సస్పెండ్ చేయాలని టీఆర్ఎస్ నాయకులు తాండ్ర నాగబాబు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ డేలో జేసీని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల వారి కోసం జిల్లా కేంద్రంలో మాతా శిశు ఆసుపత్రిని నెలకొల్పటం జరిగిందన్నారు. పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రిలో ఖరీదైన వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందుతుందని మాతా శిశు ఆసుపత్రికి వెళ్తే డెలివరీ చేస్తే రూ.6 వేలు డాక్టర్ సరళ వసూలు చేస్తున్నారని నాగబాబు ఆరోపించారు. నిర్లక్ష్యం కారణంగా పాల్వంచ మండలం నాగారం గ్రామానికి చెందిన ప్రియాంక మృతి చెందిందని, బాలింత మృతికి కారణమైన డాక్టర్ సరళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రావూరి వీరభద్రం, బన్నీ, వికాస్, ఏకే.ప్రేమ్, వడ్లమూడి రాజీవ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.