Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటీఆర్ జోక్యం చేసుకోవాలి
- వేతనాలు పెంచే వరకూ పోరాటం
నవతెలంగాణ-మణుగూరు
సెప్టెంబర్ 22 న జరిగే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై జరిగేచర్చలు విఫలమైతే ఓసీలను ముట్టడిస్తామని రాష్ట్ర జేఏసీ నాయకులు, సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు హెచ్చరించారు. సోమవారం మణుగూరు కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె శిబిరాన్ని సందర్శించి మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ జీవోలన్నీ అమలు చేయాలని కార్మికుల డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే బొగ్గు ఉత్పత్తిని స్తంభింప చేస్తామన్నారు. గత 11 రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తున్నారన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు ఆదేశాలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ని డిమాండ్ చేశారు. సమ్మెను విఫలం చేసేందుకు కుట్రలు చేస్తే సహించేది లేదన్నారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు సంవత్సరానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, కాంట్రాక్ట్ కార్మికుల ఆకలి కేకలు వినిపించడం లేదా అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పాలడుగు భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్, మణుగూరు ఏరియా జేఏసీ నాయకులు గద్దల శ్రీనివాస్ రావు, మిడిదొడ్ల నాగేశ్వరరావు గౌస్, ఆర్.లక్ష్మీనారాయణ, గౌని నాగేశ్వరరావు, వెలగపల్లి జాన్, నెల్లూరు నాగేశ్వరరావు, నరసింహారావు, భద్రం, మంగీలాల్, కృష్ణయ్య, ఇమాంబి, గట్టమ్మ, శివాని తదితరులు పాల్గొన్నారు.