Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం పినపాక మండలంలో పర్యటించి, పలు కుటుంబాలను పరామర్శించారు. పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ధ సంఖ్యలో జిల్లా సరిహద్దులో బ్రాహ్మణపల్లి చెక్ పోస్ట్ వద్ద పొంగులేటికి ఘన స్వాగతం పలికారు. మండలంలోని దుగినేపల్లి గ్రామంలోని రెడ్డి గూడెం గ్రామం నుండి ప్రారంభమైన పర్యటన జానంపేట, ముకుందాపురం, బూపతిరావుపేట, విప్పలగుంపు, దేవరనగరం, సింగిరెడ్డిపల్లి, మద్దులగూడెం, వెంకట్రావుపేట, చింతలబయ్యారం, పాతరెడ్డిపాలెం, ఏడూళ్ల బయ్యారం, మల్లారం, చినరాజుపేట, గడ్డిగూడెం, పోట్లపల్లి, గడ్డంపల్లి, సీతంపేట, ఉప్పాక తదితర గ్రామాలలో పర్యటించి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబాలను, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించారు. కార్యకర్తలకు అండగా ఉంటానని కష్టసుఖాలలో తోడుగా ఉంటానని హమి ఇచ్చారు. ఎవరూ అధైర్యపడవద్దని అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత, పినపాక, కరకగూడెం, మణుగూరు, అశ్వాపురం మండలాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.