Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం
నవతెలంగాణ-ములకలపల్లి
మండల సర్వసభ్య సమావేశంలో అధికారులు నిర్వహించిన తీరు స్థానిక ప్రజాప్రతినిధులకు ఆగ్రహం తెప్పించింది. వివరాల్లోకి వెళితే మండల కేంద్రమైన ములకలపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మట్ల నాగమణి అధ్యక్షతన సోమవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. మండలంలో 27 శాఖలకు సంబంధించిన ప్రధాన అధికారులు ఉండగా వారిలో కేవలం 17 శాఖల అధికారులు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. మిగిలిన 10 శాఖల అధికారులు గైర్హాజరయ్యారు. హాజరైన వారిలో ఎక్కువమంది ప్రధాన అధికారులు కాకుండా వారి కిందిస్థాయి సిబ్బందిని పంపడం, వారు సైతం సమావేశం మధ్యలోనే ఒక్కొక్కరుగా జారుకోవడం పట్ల ప్రజాప్రతినిధుల ఆగ్రహం వ్యక్తం చేశౄరు. స్థానిక శాఖల అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా ఉందని, ఉన్నతాధికారులు స్థానిక అధికారుల తీరుపై దృష్టి సారించి మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమావేశం అనంతరం వబ్రోత్సవ వేడుకల్లో భాగంగా కష్టపడి పనిచేసిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, పాత్రికే యులను ఎంపీడీవో నాగేశ్వరరావు, ఎంపీపీ మట్ల నాగమణిలు స్వాతంత్య్ర వజ్రోత్సవ మెడల్స్ అందచేసి సత్కరించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ సున్నం నాగమణి, వైస్ ఎంపీపీ కొడుమూరి పుల్లారావు, ఎంపీవో లక్ష్మయ్య, ఎంపీటీసీలు మడకం విజయ, తాటి తులసి, సున్నం సునీత, కొర్రి వీరభద్రం, పాడియం వెంకటేశ్వర్లు, కోఆప్షన్ మెంబర్ జబ్బార్, సర్పంచ్లు గొల్ల వెంటయ్య, బైట్ రాజేష్, వాడి నాగరాజు, కారం సుధీర్, ఏఈలు శివలాల్, వరప్రసాద్, ఏవో కరుణామయి తదితరులు పాల్గొన్నారు.