Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు, ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ ఈ నెల 21వ తేదీన జరిగే కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ పిలుపునిచ్చారు. పాల్వంచ మండలంలో సోమవారం వివిధ గ్రామాల్లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి నేటి వారికి 8ఏండ్ల కాలంలో ఒక్క సొంత ఇంటిని పేదవాళ్ళకి ఇచ్చిన పరిస్థితి లేదని ఆయన అన్నారు. డబల్ బెడ్ రూమ్లో పేరుతో కాలయాపన చేయడం తప్ప కేసీఆర్ చేసేదేమీ లేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం బాధ్యుల కొండబోయిన వెంకటేశ్వర్లు, అచ్చయ్య, వెంకట్రావు, సైదులు, నరేందర్, వినోద, లక్ష్మి నరసింహ రావు తదితరులు పాల్గొన్నారు.