Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శివలింగాపురం గ్రామస్తులు బిందెలతో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శివలింగాపురం గ్రామంలో పదిహేను రోజుల నుంచి మంచినీరు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకునే నాధుడు కరువయ్యాడని అన్నారు. వర్షాకాలంలోనే ఈ విధంగా నీటి ఎద్దడి ఉంటే ఎండాకాలంలో ఏ విధంగా నీటి సమస్య ఉంటుందో అధికారులు అర్థం చేసుకోవాలన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని లేనియెడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు పులిపాటి పాపారావు, ఎస్టీసెల్ మండల అధ్యక్షులు కొమరం రామ్మూర్తి, ఎండి షరీఫ్, కోడెం సాంబశివరావు, నాయుడు, గ్రామస్తులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.