Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోగల పూసుగుప్ప దండకారణ్యంలో చర్ల శబరి ఏరియా కమిటీ మావోయిస్టు పార్టీ పేరిట బ్యానర్లు వెలిసాయి. ఈనెల 21 నుంచి 27 వరకు జరగనున్న మావోయిస్టు పార్టీ 18వ వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని, పెద్ద ఎత్తున యువతీ యువకులు పార్టీలో భర్తీ కావాలని, సమాధాన్ ప్రహార్ దాడిని ఓడించాలని, గెరిల్లా యుద్ధాన్ని, ప్రజా యుద్ధాన్ని తీవ్రతరం చేయాలని ఆ మావోయిస్టు బ్యానర్లో పేరుకోవడం జరిగింది.