Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ రేంజ్ డిఐజి శ్రీనివాసరావు
నవతెలంగాణ-ఖమ్మం
గత అంశాలను సమీక్షించుకొని అధికారులు విధి నిర్వహణలో నిరంతరం పురోగతి సాధించాలని జైళ్ల శాఖ వరంగల్ రేంజ్ డిఐజి డి.శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఖమ్మంనగరంలోని దానవాయిగూడెం వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఈనెల 17, 18, 19లో మూడు రోజులుగా జరిగిన జిల్లా జైలుల అధికారుల రీట్రీట్-2022 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జైలు అధికారులు విధి నిర్వహణలో అనేక ఆటంకాలు వస్తుంటాయని, వాటిని నిరంతరాయంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని కోరారు. జైలు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ శ్రీధర్, జైలర్ సక్రునాయక్, వెంకటేశ్వర్లు, టి శ్రీనివాసరావు, లక్ష్మీ నారాయణ, ఖమ్మం వరంగల్ జిల్లాల జైళ్ల శాఖ అధికారులు పాల్గొన్నారు.