Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నివాళ్లర్పించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని
నవతెలంగాణ-ఎర్రుపాలెం
ఇటీవల కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు పెరుమాళ్ళ వెంకట్రామయ్య సోమవారం మృతి చెందారు. విషయం తెలియగానే బనిగండ్లపాడు గ్రామంలోని వెంకటరామయ్య స్వగృహానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు మాదినేని రమేష్, మధిర నియోజవర్గ ఇన్చార్జి చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య వెళ్లి వెంకట్రా మయ్య పార్థివదేహంపై పార్టీ జెండాను కప్పి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుదర్శన్రావు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి గ్రామంలో ఎంతో కృషి చేశారని, వెంకటరామయ్య మన మధ్యలో లేకపోవడం బాధాకరమన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నివాల్లర్పించిన వారిలో పార్టీ మండల కమిటీ సభ్యులు గొల్లపూడి కోటేశ్వరరావు, గామాసు జోగయ్య, ఎర్రమల శ్రీనివాస్ రెడ్డి, సగ్గుర్తి సంజీవరావు, షేక్ లాల, బేతి శ్రీనివాసరావు, నల్లమోతు హను మంతరావు, నాగులవంచ వెంకట్రా మయ్య, కూడెల్లి నాగేశ్వరరావు, బండారు ఉపేంద్ర, నాగరాజు, మేకల పుల్లయ్య, యుటిఎఫ్ మండల కమిటీ నాయకులు అనుమోల కోటేశ్వరరావు, బండారుపల్లి రాజారావు, నీలం అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.