Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి
ప్రజాహితం కోరుతూ, ప్రజల అభీష్టం, మనోభావాలకు అనుగుణంగా పాలన సాగిస్తూ అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం సత్తుపల్లి మండలంలోని నారాయణపురం, కిష్టాపురం, రేజర్ల, సదాశివునిపాలెం, తుంబూరు గ్రామాల్లో వర్షంలో సైతం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు మంజూరైన ఆసరా, కళ్యాణలలక్ష్మీ, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
వర్షంతో సైతం ఎమ్మెల్యే సండ్రపై పూలవర్షం...
నేరుగా పింఛన్లు, ఇతర పథకాలను లబ్ధి దారులకు నేరుగా అందించేందుకు గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యే సండ్రకు అక్కడి మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలుకుతూ పూలవర్షం కరిపించారు. సత్తుపల్లి మండలంలోని నారాయణపురం, కిష్టాపురం, రేజర్ల, సదాశివుని పాలెం, కొత్తూరు, గౌరిగూడెం సిద్దారం, తుంబూరు గ్రామాల్లో ఎమ్మెల్యే సండ్రకు ఘనస్వాగతం పలికారు. నారాయణపురంలో బతుకమ్మలతో భారీ ఊరేగింపు, అరటి ఆకులు, మామిడి తోరణాలతో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఎంపీపీ దొడ్డా హైమవతిశంకరరావు, ఎంపీటీసీ సభ్యులు తుంబూరు కృష్ణారెడ్డి, విసంపల్లి వెంకటేశ్వర రావు, సొసైటీ అధ్యక్షులు చిలుకుర్తి కృష్ణమూర్తి, మందపాటి వెంకటరెడ్డి, సర్పంచులు రంగారెడ్డి, దేశిరెడ్డి, ఒగ్గు విజయలక్ష్మీ, శ్రీనివాసరెడ్డి, మందపాటి ముత్తారెడ్డి జక్కుల ప్రభాకర్, నల్లంటి ఉదయలక్ష్మీరామ్, నాయకులు యాగంటి శ్రీనివాసరావు, ఎస్కే రఫీ పాల్గొన్నారు.